Breaking News

త్వరలో పెట్రోల్‌ వాహనాల రేట్లకి ఈవీలు

Published on Tue, 10/07/2025 - 06:05

న్యూఢిల్లీ: వచ్చే నాలుగు నుంచి ఆరు నెలల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) రేట్లు కూడా పెట్రోల్‌ వాహనాల ధరల స్థాయిలో లభించగలవని అంచనా వేస్తున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటమనేది ఆర్థికంగా భారం కావడంతో పాటు పర్యావరణంపరంగాను ప్రతికూల పరిణామాలకు దారి తీస్తోందన్నారు. ఏటా ఇంధన దిగుమతులపై రూ. 22 లక్షల కోట్లు వెచి్చంచాల్సి వస్తోందని 20వ ఫిక్కీ ఉన్నత విద్యా సదస్సు 2025లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.

 అయిదేళ్లలోగా భారత్‌ను ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ఆటోమొబైల్‌ పరిశ్రమగా నిలపాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ‘నేను రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ పరిమాణం రూ. 14 లక్షల కోట్లుగా ఉండేది. ప్రస్తుతం రూ. 22 లక్షల కోట్లకు చేరింది‘ అని  గడ్కరీ తెలిపారు.

 ప్రస్తుతం రూ. 78 లక్షల కోట్లతో అమెరికా ఆటోమొబైల్‌ పరిశ్రమ అగ్రస్థానంలోను, రూ. 47 లక్షల కోట్ల పరిమాణంతో చైనా తొలి రెండు స్థానాల్లో ఉండగా, భారత్‌ మూడో స్థానంలో ఉంది. మరోవైపు, దేశ పురోగతికి స్వచ్ఛ ఇంధనాల వినియోగం చాలా కీలకమని మంత్రి వివరించారు. మొక్కజొన్న నుంచి ఇథనాల్‌ ఉత్పత్తి చేయడం వల్ల రైతులకు అదనంగా రూ. 45,000 కోట్ల మేర ఆదాయం వచి్చందని పేర్కొన్నారు. ఇక 2027 నాటికల్లా ఘనవ్యర్ధాలను రహదారుల నిర్మాణంలో వినియోగించే ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి చెప్పారు. ఉన్నత విద్యాభ్యాసం, నైపుణ్యాలను పెంచుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)