Breaking News

ఈపీఎఫ్‌వో ‘కొత్త’ రికార్డ్‌..

Published on Thu, 08/21/2025 - 10:16

ఉద్యోగుల భవిష్య నిధి.. ఈపీఎఫ్‌వోకు జూన్‌లో నికరంగా 21.89 లక్షలమంది సభ్యులు కొత్తగా జత కలిశారు. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. వార్షికంగా 13.5 శాతం వృద్ధి నమోదైంది. నెలవారీగా చూస్తే ఈ సంఖ్య 9.15 శాతం బలపడింది. కార్మిక శాఖ వెల్లడించిన ప్రొవిజనల్‌ గణాంకాలివి. వీటి ప్రకారం 2018 ఏప్రిల్‌లో ఈపీఎఫ్‌వో పేరోల్‌ గణాంకాల విడుదల ప్రారంభించాక గరిష్టస్థాయిలో సభ్యులు జత కలడం గమనార్హం!

ఉద్యోగ అవకాశాలు పుంజుకోవడం, ఉద్యోగ లబ్దిపై అవగాహన పెరగడానికితోడు ఈపీఎఫ్‌వో ప్రభావవంత కార్యక్రమాలు ఇందుకు దోహదపడినట్లు కార్మిక శాఖ పేర్కొంది. కాగా.. 2025 జూన్‌లో 10.62 లక్షలమంది కొత్త సబ్ర్‌స్కయిబర్లు ఎన్‌రోల్‌ అయ్యారు. 2025 మేతో పోలిస్తే 12.7 శాతం అధికంకాగా.. వార్షికంగా 3.6 శాతం వృద్ధి ఇది. వీరిలో 18–25 మధ్య వయసు కలిగినవారి సంఖ్య 6.39 లక్షలమంది. అంటే 60 శాతానికిపైగా వాటా వీరిదే.

ఈ గ్రూపులో నికర పేరోల్‌ జమలు 9.72 లక్షలుగా నమోదైంది. ఇంతక్రితం వైదొలగినవారు సుమారు 16.93 లక్షలమంది 2025 జూన్‌లో ఈపీఎఫ్‌వోకు జత కలిశారు. ఈ కాలంలో 3.02 లక్షలమంది మహిళలు ఈపీఎఫ్‌వో కొత్త సబ్‌స్కయిబర్లుగా చేరారు. 2025 మే నెలతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. నికర పేరోల్‌ జమల్లో మహిళల సంఖ్య 4.72 లక్షలుగా నమోదైంది. రాష్ట్రాలవారీగా పేరోల్‌ గణాంకాలు చూస్తే 20 శాతంతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా.. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ తదితరాలు 5 శాతం చొప్పున వాటా ఆక్రమించాయి.

ఇదీ చదవండి: ఉమాంగ్ యాప్‌లో యూఏఎన్‌.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)