Breaking News

ఉద్యోగుల మనసు దోచిన బాస్ నిర్ణయం!

Published on Fri, 11/20/2026 - 08:54

పనిచేసే ఉద్యోగిని బాస్ మెచ్చుకుంటే, లేదా కొన్ని వెసులుబాట్లు కల్పిస్తే?.. ఎలా ఉంటుంది. దాని గురించి బహుశా అనుభవించినవాళ్లకే తెలుస్తుంది. అలాంటి అనుభవమే యూరప్ ప్రాంతంలో పనిచేస్తున్న ధిమాహి జైన్ అనే ఉద్యోగిని ఎదురైంది. ఆ విషయాన్ని ఆమె తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

సాధారణంగా ధిమాహి జైన్ ఆఫీస్ వర్క్ రాత్రి 10:30 గంటలకు ముగుస్తుంది. అయితే.. తప్పకుండా పూర్తిచేయాల్సిన పని ఉండటం చేత.. ఆమె అర్ధరాత్రి దాటి తెల్లవారుజామున 1 గంట వరకు పనిచేయాల్సి వచ్చింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో.. మేనేజర్లు ఉద్యోగులకు కేవలం థ్యాంక్యూ చెప్పి సరిపెడుతుంటారు. కానీ తమ ఆఫీసులో మాత్రం అందుకు భిన్నంగా స్పందించారని చెప్పింది.

అదనపు సమయం పనిచేసిన ఉద్యోగుల పట్ల.. తన మేనేజర్ చూపించిన బాధ్యతాయుతమైన వైఖరి ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. అదనపు సమయం పనిచేసిన ఉద్యోగులు.. మరుసటి రోజు సాధారణ సమయం కంటే ఆలస్యంగా లాగిన్ కావచ్చని మేనేజర్ తెలిపారు. అంటే.. ఎక్కువ సమయం పనిచేసినందుకు.. బదులుగా మరుసటి రోజు విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించారు. కేవలం మాటల్లో కృతజ్ఞతలు చెప్పడం కాకుండా, ఉద్యోగులు పెట్టిన అదనపు సమయాన్ని గుర్తించి తగిన వెసులుబాటు కల్పించడం ఆమెకు నచ్చింది.

ఈ విషయాన్ని ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ధిమాహి జైన్ తన మేనేజర్‌పై ప్రశంసలు కురిపించారు. చాలా మంది మేనేజర్లు అదనంగా పనిచేసినప్పుడు థ్యాంక్యూ అని మాత్రమే చెబుతారని, కానీ తన మేనేజర్ మాత్రం అదనంగా పనిచేసిన సమయానికి పరిహారంగా మరుసటి రోజు ఆలస్యంగా లాగిన్ కావచ్చని చెప్పారని వెల్లడించారు. ఇలాంటి ఆలోచన కలిగిన మేనేజర్ ఉండటం తన అదృష్టమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: దిగ్గజ బ్యాంకులో డేటా లీక్ కలకలం!

ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఉద్యోగుల నుంచి అదనపు పని తీసుకున్నప్పుడు సంస్థలు, మేనేజర్లు వారి సమయానికి తగిన గుర్తింపు ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర పనులు, డెడ్‌లైన్లు ప్రతి ఉద్యోగంలోనూ సహజమే అయినప్పటికీ, ఉద్యోగుల వ్యక్తిగత జీవితాన్ని కూడా గౌరవించడం ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Videos

ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!

ఇండియన్ సినిమాలో యశ్ సరికొత్త చరిత్ర!

అవినాష్ రెడ్డిని చంపే కుట్ర!

మురళి నాయక్ నీకు మైండ్ పోయిందా..! అవినాష్ రెడ్డి ఫైర్

అహం తగ్గించుకో.. పండవెట్టి తొక్కుతావా! అయ్యప్ప మాలలో ఉండి చెప్తున్నా..

Exclusive Video: వైఎస్ అవినాష్ రెడ్డిపై దగ్గరుండి దాడి చేయించిన బీటెక్ రవి

భారీ పతనం.. ఒక్కరోజే రూ.5,120 తగ్గిన బంగారం!

పక్కా స్కెచ్ తోనే వైఎస్ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం..

చలో పదవే అని శోభితతో లాంగ్ డ్రైవ్ వెళ్తా..!

TVK ఎమ్యెల్యే vs బాబు పార్థివదేహానికి విజయ్ నివాళి

Photos

+5

న్యూజిలాండ్ లవ్ బర్డ్స్ ఎవరో తెలుసా? కెప్టెన్ అండ్‌ ఆల్‌రౌండర్ ప్రేమకథ (ఫోటోలు)

+5

అక్వాన్‌ తుపాను అలజడి.. (ఫోటోలు)

+5

టైమ్100 నెక్స్ట్ ఇండియా జాబితా.. ఎవరెవరికి చోటంటే (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

అనిరుధ్-కావ్య పెళ్లి...కొత్త ఫోటోలు చూశారా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)