Breaking News

మస్క్‌ వారి మరమనిషి మరింత కొత్తగా.. టెస్లా రోబో 2.0!

Published on Thu, 12/14/2023 - 07:59

అప్పుడు యోగా చేసి ఆశ్చర్యపరిచిన టెస్లా హ్యూమనాయిడ్‌ రోబో ఇప్పుడు డ్యాన్స్‌ ఇరగదీస్తోంది.  గుడ్లు చకాచకా ఉడకబెట్టేస్తోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ సరికొత్తగా ఆవిష్కరించిన హ్యుమనాయిడ్‌ రోబో డెమో వీడియోను మస్క్‌ తన ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా పంచుకున్నారు. 

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా..  తన కొత్త తరం హ్యూమనాయిడ్ రోబో 'ఆప్టిమస్ జెన్ 2' (Optimus Gen-2) ను ఆవిష్కరించింది. ఇది ఏమేమి పనులు చేయగలదో మస్క్‌ షేర్‌ చేసిన వీడియో​లో చూడవచ్చు. ఇది అచ్చం మనిషిలాగే వివిధ పనులు చేస్తోంది. టెస్లా కొన్ని నెలల క్రితం ఆవిష్కరించిన 'ఆప్టిమస్ జెన్ 1'ను మరింత మెరుగుపరిచి ఈ 'ఆప్టిమస్ జెన్ 2' రూపొందించింది. ఇది మునుపటి రోబో కంటే 10 కేజీలు తేలికైనది. 30 శాతం వేగవంతమైనది. దీనికి మరింత సామర్థాన్ని జోడించారు. నడక వేగం, చేతి కదలికలు, వేళ్లపై స్పర్శ సెన్సింగ్ తదితర అన్ని అంశాల్లోనూ మెరుగుదలను ప్రదర్శిస్తోంది.

ఇది కూడా చదవండి: CEOs Secret WhatsApp chat: ‘శామ్‌ అవుట్‌’.. వెలుగులోకి సీఈవోల సీక్రెట్‌ వాట్సాప్‌ చాట్‌

ఎలాన్‌ మస్క్‌ తాజాగా ‘ఎక్స్‌’లో షేర్‌ చేసిన ఈ వీడియోకు "ఆప్టిమస్" అని క్యాప్షన్‌ పెట్టారు. టెస్లా ఫ్యాక్టరీలో చుట్టూ సైబర్‌ ట్రక్‌ల మధ్య షైనీ వైట్‌ కలర్‌ బాడీలో ఆప్టిమస్‌ జెన్‌2 రోబో మెరిసిపోతూ కనిపిస్తోంది. వీడియో చివర్లో రెండు రోబోలు డ్యాన్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి. కాగా 2022లో మొదటిసారిగా హ్యూమనాయిడ్‌ రోబో కాన్సెప్ట్‌ గురించి వెల్లడించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)