Breaking News

మస్క్ కంపెనీలో జాబ్స్: జీతం ఎంతో తెలుసా?

Published on Fri, 10/03/2025 - 19:05

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఏఐ కంపెనీ అయిన ఎక్స్ఏఐ (xAI) దాని చాట్‌బాట్ 'గ్రోక్' కోసం ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. వీడియో గేమ్‌ల కోసం.. వీడియో గేమ్స్ ట్యూటర్‌లను నియమించుకోనుంది. వీరు గ్రోక్‌కు గేమ్‌లను రూపొందించడం, కథలు చెప్పడం, యూజర్ ఆలోచనలకు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

గ్రోక్ టెక్స్ట్ ఆధారిత సంభాషణలకు పరిమితం చేయకుండా.. మరింత సృజనాత్మకంగా ఉండేలా ట్యూటర్స్ శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి వీరు ఎక్స్ఏఐ సాఫ్ట్‌వేర్‌తో పని చేస్తారు. గేమ్ డిజైన్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం కంపెనీ అన్వేషిస్తోంది. అయితే ఎన్ని ఉద్యోగాలు, ఎంతమందిని నియమించుకుంటారనే విషయం వెల్లడించలేదు.

ఎంపికైన ఉద్యోగులు కాలిఫోర్నియాలోని ఆఫీసులో పనిచేయాల్సి ఉంటుంది. కానీ రిమోట్‌గా కూడా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది. రిమోట్‌గా వర్క్ చేయాలనుకునే అభ్యర్థులకు సెల్ఫ్ డిసిప్లైన్, స్ట్రాంగ్ మోటివేషన్ వంటివి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు మొదటి రెండు వారాలు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అనుకూలమైన టైమ్ ఎంచుకోవచ్చు.

ఇదీ చదవండి: నాలుగు నిమిషాల మీటింగ్: ఉద్యోగం నుంచి తీసేశారు!

జీతం & ప్రయోజనాలు
ఎంపికైన ఉద్యోగులకు జీతం గంటకు 45 డాలర్ల నుంచి 100 డాలర్ల వరకు ఉంటుంది. ప్రయోజనాలు దరఖాస్తుదారు నివసించే దేశంపై ఆధారపడి ఉంటాయి. ఫుల్ టైమ్ జాబ్ చేసే ఉద్యోగులకు మెడికల్ కవరేజ్ లభిస్తాయి. అయితే, పార్ట్-టైమ్ ఉద్యోగులకు ఇలాంటి ప్రయోజనాలు ఉండవు.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)