Breaking News

కోర్టులో ట్విటర్‌ రచ్చ.. అదిరిపోయే ప్లాన్‌ వేసిన ఎలాన్‌ మస్క్‌!

Published on Sun, 07/17/2022 - 18:20

టెస్లా అధినేత ఎలాన్‌మస్క్‌ వెర్సస్‌ ట్విటర్‌ మధ్య మొదలైన యుద్ధం ఇప్పుట్లో ముగిసేలా లేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే డైలీ సీరియల్‌లా సాగతీతే కనిపిస్తోంది. వారిద్దరి మధ్య డీల్‌ రద్దు కావడంతో ఇటీవల ట్విటర్‌ కోర్టు మెట్లేక్కి త్వరగా విచారణ పూర్తి చేయాలని కోరగా , మస్క్‌ మాత్రం విచారణ వాయిదా వేయాలని కోరుతున్నాడు. 

ట్విటర్‌ ఏమంటోంది..
‘44 బిలియన్‌ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తామని ముందుకు వచ్చిన ఎలాన్‌ మస్క్‌ ఇటీవల ఆ డీల్‌ నుంచి తప్పుకున్నారు. ఒప్పందంలోని నిబంధనలను మస్క్‌ ఉల్లంఘించారు. కనుక ముందుగా అనుకున్న ప్రకారమే ఈ డీల్‌ను పూర్తి చేయాలని’ ట్విట్టర్‌ తన దావాలో కోరింది. విచారణను కూడా త్వరగా పూర్తి చేయాలని కోర్టును కోరింది. 

మస్క్‌ తరపు న్యాయవాది వాదన ఏంటి?
దీనికి మస్క్‌ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు అభ్యర్థనలను కోర్టు ముందు ఉంచారు. ఆయన మాట్లాడుతూ.. ట్విటర్‌ కావాలనే విచారణ త్వరగా పూర్తి చేయాలని అంటోంది. ఎందుకుంటే విచారణ త్వరగా పూర్తి చేసే ప్రక్రియలో ట్విటర్‌ తన తప్పలను కప్పిపుచ్చకోవచ్చని భావిస్తోందని ఆయన ఆరోపించారు. ట్విటర్‌లో ఉన్న నకిలీ, స్పామ్‌ అకౌంట్లును కనిపెట్టేందుకు కాస్త సమయం పడుతుందని అసలు నిజాలు బయటపడాలంటే కనీసం ఐదు నుంచి ఆరు నెలలు సమయం పడుతుందని తెలిపారు. అందుకు విచారణను 2023 వరకు వాయిదా వేయాలని మస్క్‌ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. 

అమెరికా మీడియా కథనాలు..
ఎలాన్‌ మస్క్‌ కావాలనే విచారణ ఆలస్యం చేయాలని చూస్తున్నాడని, దీని ద్వారా డీల్‌ను ఆటోమెటిగ్గా రద్దు అయ్యేలా చేయడమే ఆయన ప్రధాన వ్యూహమని అమెరికా మీడియాలో కధనాలు వెలువడ్డాయి.

చదవండి: Netflix Subscription: మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన నెట్‌ఫ్లిక్స్‌.. తక్కువ ధరలకే కొత్త ప్లాన్‌!

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)