Breaking News

రెండేళ్లలో రూ.రెండు లక్షల కోట్ల నష్టం

Published on Thu, 09/05/2024 - 09:21

ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌(ట్విటర్‌) విలువ గడిచిన రెండేళ్లలో దాదాపు 72 శాతం తగ్గిపోయినట్లు ‘న్యూయార్క్‌పోస్ట్‌’ నివేదించింది. ఇలాన్‌మస్క్‌ అక్టోబర్‌ 2022లో ఎక్స్‌లో అధిక వాటా కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్వెస్టర్ల గ్రూప్‌నకు సుమారు 24 బిలియన్‌ డాలర్ల(రూ.2 లక్షల కోట్లు) నష్టం వాటిల్లినట్లు తెలిపింది.

2022 అక్టోబర్‌తో పోలిస్తే ఎక్స్‌ విలువ దాదాపు 72 శాతం తగ్గిపోయింది. ఎక్స్‌లో అధిక వాటాలు కలిగిన ఎనిమిది మంది పెట్టుబడిదారుల ఇన్వెస్ట్‌మెంట్‌ మస్క్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత దాదాపు 5 బిలియన్‌ డాలర్లు(రూ.41 వేలకోట్లు) తగ్గిపోయింది. ఎక్స్‌లో ప్రధానంగా జాక్‌డోర్సె, లారీ ఎల్సిసన్, సైకియా క్యాపిటల్స్‌ పెట్టుబడులు ఉన్నాయి. మస్క్‌ తర్వాత అతిపెద్ద పెట్టుబడిదారుగా కింగ్‌ అల్వీద్‌ బిన్‌ తలాల్‌ నిలిచారు. ఆయన వాటా 1.9 బిలియన్‌ డాలర్లు(రూ.15 వేలకోట్లు)గా ఉంది.

ఇదీ చదవండి: 2.75 లక్షల ఫోన్‌ నంబర్లకు చెక్‌

భవిష్యత్తులో ఎక్స్‌ ఆదాయ వనరులు భారీగా పెరుగుతాయని అల్వీద్‌ బిన్‌ తలాల్‌ విశ్వసిస్తున్నట్లు న్యూయార్క్‌పోస్టు తెలిపింది. కొంతకాలంగా ఎక్స్‌లో వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతోంది. సబ్‌స్క్రిప్షన్‌ సర్వీస్‌ ఛార్జీలు విధించడంతో ఎక్కువ మంది వినియోగదారులు ఈప్లాన్లపై ఆసక్తి చూపించడం లేదు. ఎక్స్‌ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో లేఆఫ్స్‌ ఇస్తుండడంతో నిర్వహణలో మార్పులు వస్తున్నట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. పలు నియంత్రణ సంస్థల నుంచి ఎక్స్‌కు సమస్యలు ఎదురవుతున్నాయి.

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)