Breaking News

మింత్రాపై ఈడీ ఫెమా కేసు

Published on Thu, 07/24/2025 - 06:30

న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ–కామర్స్‌ సంస్థ మింత్రాపై విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) కింద కేసు నమోదైంది. రూ. 1,654 కోట్ల పెట్టుబడుల విషయంలో మింత్రాతో పాటు, దానితో సంబంధమున్న కంపెనీలు, డైరెక్టర్లపై తమ బెంగళూరు జోనల్‌ ఆఫీసు ఫిర్యాదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెలిపింది. హోల్‌సేల్‌ క్యాష్‌ అండ్‌ క్యారీ పేరిట విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సమీకరించిన మింత్రా, దాని అనుబంధ కంపెనీలు మలీ్ట–బ్రాండ్‌ రిటైల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయనేది ప్రధాన ఆరోపణ. 

కంపెనీ సింహ భాగం ఉత్పత్తులను వెక్టార్‌ ఈ–కామర్స్‌ సంస్థకు విక్రయిస్తోండగా, సదరు కంపెనీ అంతిమంగా కస్టమర్లకు రిటైల్‌గా విక్రయిస్తోందని ఈడీ వివరించింది. ఈ రెండు సంస్థలూ ఒకే గ్రూప్‌లో భాగమని  తెలిపింది. మరోవైపు, చట్టాలను తాము గౌరవిస్తామని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని మింత్రా ప్రతినిధి తెలిపారు. డిజిటల్‌ కామర్స్‌ ద్వారా దుస్తుల పరిశ్రమకు సాధికారత కలి్పంచడం ద్వారా దేశ నిర్మాణానికి కంపెనీ తన వంతు తోడ్పాటు అందిస్తోందన్నారు. ప్రస్తు నిబంధనల ప్రకారం మార్కెట్‌ప్లేస్‌ విధానంలో కార్యకలాపాలు సాగించే కంపెనీల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులున్నాయి. 2007లో ఏర్పాటైన మింత్రా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌లో భాగంగా ఉంది.
 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?