Breaking News

ట్రంప్ ప్రకటన: గ్రీన్‌ల్యాండ్‌ రేటెంతో తెలుసా?

Published on Mon, 01/13/2025 - 12:28

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) డెన్మార్క్‌లోని గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే నిజమైతే.. గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని న్యూయార్క్ ఫెడ్‌లో రియల్ ఎస్టేట్ డెవలపర్ & మాజీ ఆర్థికవేత్త 'డేవిడ్ బార్కర్' (David Barker) ఓ అంచనా వేశారు.

గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలంటే 12.5 బిలియన్ డాలర్ల నుంచి 77 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని బార్కర్ వెల్లడించారు. అంటే ఈ విలువ భారతీయ కరెన్సీ ప్రకారం.. రూ.1 లక్ష కోట్ల నుంచి రూ. 6.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలనే ఆసక్తి ట్రంప్‌కు కొత్తేమీ కాదు. 2016లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు కూడా 1946లో ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమాన్ ఈ భూభాగాన్ని 100 మిలియన్ డాలర్ల విలువైన బంగారానికి కొనుగోలు చేయాలని అనుకున్నారు. కానీ దీన్ని డెన్మార్క్ తిరస్కరించింది.

ఇదీ చదవండి: పాకిస్తాన్‌లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..

అమెరికా విదేశీ భూభాగాలను కొనుగోలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఫ్రాన్స్ నుంచి లూసియానా, డెన్మార్క్ నుంచి వర్జిన్ ఐలాండ్స్, రష్యా నుంచి అలస్కా వంటి భూభాగాలను యూఎస్ఏ కొనుగోలు చేసింది. కాగా ఇప్పుడు గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడం అనేది అంత సులభమైన పనేమీ కాదు. అంతే కాకుండా అక్కడి ప్రధాన మంత్రి 'మ్యూట్ బౌరప్ ఎగెడే' (Mute Bourup Egede).. ఈ ద్వీపం అమ్మకం కోసం కాదు.. ఎప్పటికీ అమ్మకానికి ఉండదని పేర్కొన్నారు.

గ్రీన్‌ల్యాండ్‌
గ్రీన్‌ల్యాండ్‌ అనేది అత్యంత సుందరమైన ఐలాండ్. ఇక్కడ అపారమైన ఖనిజ (రాగి, లిథియం) సంపద ఉంది. లిథియం అనేది ఎలక్ట్రిక్ వాహనాలలో, ఎలక్ట్రానిక్స్ వంటి వాటిలో విరివిగా ఉపయోగిస్తారు. ఇక్కడి ఖనిజ సంపద విలువ సుమారు రూ. 94 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇలాంటి ద్వీపాన్ని అమెరికా సొంతం కొనుగోలు చేయడం బహుశా అసాధ్యమే.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)