Breaking News

ఎన్విడియా సీఈఓ వివాదం.. స్పందించిన ట్రంప్

Published on Mon, 11/09/2026 - 11:26

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదం నడుస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. హువాంగ్‌ను మంచి మనసున్న వ్యక్తిగా అభివర్ణిస్తూ ప్రశంసించారు. అమెరికా కోసం ఆయన అద్భుతమైన సేవలు అందించారని కొనియాడారు. అయితే.. చైనా వ్యాపారవేత్తతో సంబంధాలున్నాయన్న ఆరోపణల గురించి తాను హువాంగ్‌తో మాట్లాడలేదని స్పష్టం చేశారు.

ఆదివారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. హువాంగ్ చాలా గౌరవప్రదమైన వ్యక్తి అని తనకు తెలుసని అన్నారు. కానీ.. ఆయన వ్యక్తిగతంగా ఏం జరుగుతుందో పూర్తిగా తెలియదని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో అంతా సవ్యంగా ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆరోపణలపై హువాంగ్ వివరణ కూడా వినాలని, ఆయనకు తన వాదన చెప్పుకోవడానికి ఏదైనా కారణం ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

జెన్సన్ హువాంగ్‌కు చైనాకు చెందిన ఓ వ్యాపారవేత్తతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆమె బీజింగ్‌కు కీలక సమాచారాన్ని చేరవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో హువాంగ్ విదేశీ గూఢచర్య ప్రయత్నాలకు లక్ష్యంగా మారారా?.. అనే కోణంలో ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు స్వతంత్ర విచారణ ప్రారంభించింది. ఈ పరిణామం టెక్ ప్రపంచంలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు వచ్చే వారం ట్రంప్ ఆసియా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు జెన్సన్ హువాంగ్‌ను కూడా తీసుకెళ్తారా అని మీడియా ప్రశ్నించగా.. తనకు ఇంకా తెలియదని, అయితే హువాంగ్‌ను తీసుకెళ్లడానికి మాత్రం సిద్ధంగా ఉన్నానని ట్రంప్ బదులిచ్చారు. దీంతో వివాదం కొనసాగుతున్నప్పటికీ ట్రంప్ ఆయనకు మద్దతుగా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే హువాంగ్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు ఏంటనేది ఎన్విడియా చేపట్టిన విచారణలో తేలాల్సి ఉంది.

ఇదీ చదవండి: 'క్షమించండి.. ఆమెతో వివాహేతర సంబంధం నిజమే': ఎన్విడియా సీఈఓ

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)