బిల్డప్ మాధవి.. కడప ఎమ్మెల్యే ఓవరాక్షన్
Breaking News
డొనాల్డ్ ట్రంప్ బంగారం విగ్రహం!
Published on Thu, 09/18/2025 - 11:12
అమెరికా కాపిటల్ వెలుపల అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' బిట్‌కాయిన్ పట్టుకుని ఉన్న 12 అడుగుల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గింపు నేపథ్యంలో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారుల నిధులతో.. ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ బిట్‌కాయిన్ చేతపట్టుకున్న విగ్రహం.. డిజిటల్ కరెన్సీ, మనీటరీ పాలసీ, ప్రభుత్వ వ్యవహారాలలో వడ్డీ పాత్ర వంటి విషయాల మీద ప్రజలలో చర్చ మొదలవ్వాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇది ట్రంప్, క్రిప్టో మద్దతుదారుల మధ్య సంబంధాలను ప్రతీక అని చెబుతున్నారు. ఈ విగ్రహంపై తీవ్రమైన విమర్శలు కూడా కురిపిస్తున్నారు. అయితే ఈ విగ్రహాన్ని బంగారంతో చేసారా? లేక బంగారం పూత పూశారా?.. లేదా ఇతర మెటల్స్ ఉపయోగించి రూపొందించారా? అనేది తెలియాల్సి ఉంది.
25 శాతం తగ్గిన ఫెడ్ వడ్డీ రేటు
యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్షలో వడ్డీ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు నిర్ణయించింది. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు జరిగిన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) వడ్డీ రేటులో 0.25 శాతం తగ్గింపుకే సుముఖత చూపింది. గత ఐదు పాలసీ సమీక్షలలో వడ్డీ రేటును యథాతథ ఉంచడానికి మొగ్గుచూపారు. అయితే 9 నెలల తరువాత వడ్డీ రేటు తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నారు.
A crypto group installed a 12-foot golden statue of President Trump 🇺🇸 holding a #Bitcoin placed outside the US capital.
This is gold 😂 pic.twitter.com/K3i69PeHCU— CryptoMalaysia (@CryptoMYsia) September 18, 2025
Tags : 1