దీపావళి వేళ ఆదివారం స్టాక్ మార్కెట్ ప్రత్యేక ట్రేడింగ్!

Published on Sat, 11/07/2026 - 09:34

దీపావళి పండగ వేళ కొత్త పెట్టుబడులు ప్రారంభించడాన్ని మదుపర్లు అత్యంత శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవి పూజ జరుపుకునే ఈ పర్వదినాన ఏ చిన్న శుభకార్యం లేదా వ్యాపారం ప్రారంభించినా విజయం వరిస్తుందని, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా దలాల్ స్ట్రీట్‌లో ఈ ఆనవాయితీ దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ రోజున స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తే వచ్చే దీపావళి నాటికి లాభాల పంట పండుతుందనే బలమైన విశ్వాసంతో సాధారణ మదుపర్ల నుంచి బడా ఇన్వెస్టర్ల వరకు అందరూ ‘మూరత్‌ ట్రేడింగ్’లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు.

ఈసారి మూరత్ ట్రేడింగ్ వివరాలు

ఈ సంప్రదాయాన్ని నిలబెడుతూ మన దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఈసారి ఆదివారం నవంబర్ 08, 2026న దీపావళి లక్ష్మీ పూజ సందర్భంగా గంటపాటు ప్రత్యేక మూరత్‌ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ప్రీ-ఓపెన్ సెషన్ మధ్యాహ్నం 2:05 నుంచి 2:20 గంటల వరకు ఉంటుంది. తరువాత మధ్యాహ్నం 2:20 నుంచి 3:30 వరకు ట్రేడింగ్ జరుగుతుంది.

మదుపర్ల వ్యూహం

దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే మూరత్‌ ట్రేడింగ్ రోజున మార్కెట్లు సూచీలు లాభాల్లోనే ముగిసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ఇది కేవలం ప్రతీకాత్మకమైనది కాబట్టి, మదుపర్లు దీర్ఘ కాలానికి మంచి రాబడులు ఇచ్చే బలమైన ఫండమెంటల్స్ ఉన్న క్వాలిటీ షేర్లలో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్తగా మార్కెట్లోకి అడుగుపెట్టేవారికి ఈ రోజు
శుభారంభం అని చెప్పవచ్చు.

ఇదీ చదవండి: మాదేశం వచ్చినవారికి గుడ్‌న్యూస్‌!

Videos

గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు

మా వాళ్లను బయటకు గెంటి.. ఆ నా కొడుకులు దొంగ ఓట్లు గుద్దుకుంటుంటే చూస్తున్నావా?

YSRCP గెలుపు తట్టుకోలేక మంత్రి సవిత అనుచరుల వీరంగం

ZPTC, MPTC ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం

మొండిగా పోరాటం చేశాం.. దాని ఫలితమే ఈ ZPTC విజయం

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

Photos

+5

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)