కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్
Breaking News
డిజిటల్‌ట్యాక్స్‌కు భారత్–అమెరికా అంగీకారం
Published on Thu, 11/25/2021 - 09:08
న్యూఢిల్లీ: ఈ కామర్స్ సరఫరాలపై తటస్థీకరణ పన్ను లేదా డిజిటల్ ట్యాక్స్ అమలు విషయమై భారత్–అమెరికా తాత్కాలిక విధానానికి అంగీకారం తెలిపాయి. అంతర్జాతీయ పన్ను సంస్కరణలకు 136 దేశాలు ఈ ఏడాది అక్టోబర్ 8న అంగీకారం తెలియజేసిన విషయం గమనార్హం. దీంతో బహుళజాతి కంపెనీలు తాము కార్యకలాపాలు నిర్వహించే దేశాల్లో 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని అమలు చేయాలంటే.. ఆయా దేశాలు డిజిటల్ ట్యాక్స్ తరహా పన్నులను రద్దు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులోనూ ఈ తరహా పన్నులను తీసుకురాకూడదు. ఇందుకు పిల్లర్–1, పిల్లర్–2 పేరుతో రెండంచెల విధానాన్ని రూపొందించారు.
ఈ కామర్స్ సరఫరాలపై భారత్ 2020 ఏప్రిల్ 1 నుంచి 2 శాతం పన్ను విధించనుంది. అమెరికా కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుంది. పిల్లర్–1ను అమలు చేసే వరకు లేదా.. 2024 మార్చి 31 వరకు ఏది ముందు అయితే అది అమల్లో ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
చదవండి: అమెరికాకు మామిడి ఎగుమతులు
Tags : 1