Breaking News

మహా కుంభమేళాలో డిజిటల్‌ స్నానం! వీడియో వైరల్‌

Published on Fri, 02/21/2025 - 21:06

మహా కుంభమేళాకు (Maha Kumbh) సంబంధించి ప్రతిరోజూ పలు వింత వార్తలు, కథనాలు వస్తున్నాయి. త్రివేణి సంగమంలో తమ పాపాలను కడుక్కోవడానికి కొందరు వస్తుంటే మరికొందరు ఎప్పుడో దూరమైన తమ కుటుంబాలతో తిరిగి కలుస్తున్నారు. కొందరికి మాత్రం పెద్ద జనసమూహాల మధ్య కొత్త వ్యాపార ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి.

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమానికి ఇప్పటికే దాదాపు 6 కోట్ల మంది యాత్రికులను ఆకర్షించింది. అయితే ప్రయాణం చేయలేని వారి కోసం, స్థానిక ఔత్సాహిక ఎంట్రాప్రెన్యూర్‌ దీపక్ గోయల్ 'డిజిటల్ స్నాన్' (Digital Snan) సర్వీస్‌ను ప్రవేశపెట్టారు.  దీని ద్వారా భక్తులు సంగమంలో స్నానం కోసం వాట్సాప్ ద్వారా తమ ఫొటోలను పంపవచ్చు. ఇందుకోసం అతను ఒక్కొక్కరికి రూ.1,100 ధర నిర్ణయించాడు.

సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు
మహా కుంభమేళాలో డిజిటల్‌ స్నానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమర్శలతోపాటు ఉత్సుకతనూ రేకెత్తించింది. కొంతమంది యూజర్లు ఈ ఆలోచనను విశ్వాస దోపిడీ అంటూ విమర్శిస్తూ ఉంటే.. మరికొందరు అక్కడికి వెళ్లలేని వారికి ఇది అనుకూలమైన ప్రత్యామ్నాయంగా పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి: ‘మహా కుంభ్’ వ్యాపారం.. రూ. 3 లక్షల కోట్లు!

ఆధునిక సాంకేతికతతో విశ్వాసం ముడిపడి ఉండటం ఇదే మొదటిసారి కాదు. పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఆన్‌లైన్‌లో దాని గురించి ఒక కరపత్రాన్ని పంచుకున్నప్పుడు ఇలాంటి 'వాట్సాప్ సాల్వేషన్' సర్వీస్‌ దృష్టిని ఆకర్షించింది. ఇటువంటి సర్వీస్‌లు ఆధ్యాత్మికపరమైన ప్రామాణికతను పలుచన చేస్తాయని విమర్శకులు వాదిస్తున్నప్పటికీ, డిజిటల్ ప్రపంచంలోనూ సంప్రదాయానికి ప్రాధాన్యత ఎలా కొనసాగుతోందో కూడా అవి తెలియజేస్తున్నాయి.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)