Breaking News

దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకే కంప్యూటర్ల దిగుమతిపై ఆంక్షలు

Published on Sat, 08/05/2023 - 08:08

న్యూఢిల్లీ: పర్సనల్‌ కంప్యూటర్లు (పీసీ), ల్యాప్‌టాప్‌ల దిగుమతి లైసెన్సు కోసం కంపెనీలు/ట్రేడర్లు దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) ప్రత్యేక పోర్టల్‌ రూపొందించింది. వివరాలన్నీ సక్రమంగా ఉంటే దరఖాస్తు చేసుకున్న 3–4 రోజుల్లోనే లైసెన్సును జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే రవాణాలో ఉన్న కన్‌సైమెంట్స్‌ను లైసెన్సు లేకుండా అనుమతిస్తారని వివరించాయి. పీసీలు, ల్యాప్‌టాప్‌ల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దేశీయంగా ఐటీ హార్డ్‌వేర్‌ డివైజ్‌లను తయారు చేసుకునేందుకు భారత్‌కు తగినంత సామర్ధ్యం ఉండటం వల్ల నియంత్రణల విధింపుతో కంప్యూటర్ల లభ్యతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 

భద్రత కోసమే నియంత్రణలు.. 
దిగుమతైన కంప్యూటర్లలోని హార్డ్‌వేర్‌లో ఏవైనా లొసుగులు ఉంటే, వాటి నుంచి కీలకమైన వ్యక్తిగత, సంస్థాగత డేటాకు ముప్పు కలగకుండా భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఇంటర్నెట్‌ విస్తృతి పెరుగుతుండటంతో ప్రజలు ఆన్‌లైన్‌ మోసాల బారిన పడే అవకాశాలూ మరింతగా పెరిగాయని చెప్పాయి. ఈ నేపథ్యంలోనే దేశం, దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతోనే ప్రభుత్వం తాజా నియంత్రణలు విధించిందని అధికారులు తెలిపారు.

అలాగే, చైనాతో వాణిజ్య సమతౌల్యం సాధించేందుకు కూడా ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. టారిఫ్‌యేతర నియంత్రణలనేవి దిగుమతులపై నిషేధం కిందికి రావని, లైసెన్సు తీసుకున్న వారు దిగుమతి చేసుకోవచ్చని వివరించారు. అటు, హార్డ్‌వేర్‌.. సిస్టమ్స్‌ విశ్వసనీయమైనవిగా ఉండేలా చూసేందుకు, దిగుమతులను తగ్గించుకునేందుకు, దేశీయంగా ఉత్పత్తిని పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఒక ట్వీట్‌ ద్వారా తెలిపారు.

2022–23లో ల్యాప్‌టాప్‌లు, పీసీల దిగుమతులు 5.33 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌ మధ్య వ్యవధిలో పీసీలు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఎల్రక్టానిక్స్‌ దిగుమతుల విలువ 19.7 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)