Breaking News

20 ఏళ్ల పాత విమానాల దిగుమతికి డీజీసీఏ పరిశీలన

Published on Sat, 09/06/2025 - 08:37

అంతర్జాతీయంగా సరఫరా సమస్యల వల్ల విమానాల డెలివరీలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో  20 ఏళ్ల పాత విమానాలను దిగుమతి చేసుకునేందుకు అనుమతించే అంశాన్ని ఏవియేషన్‌ రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ పరిశీలిస్తోంది. ఇందుకోసం సంబంధిత నిబంధనలను సడలించడంపై దృష్టి సారిస్తున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

ప్రస్తుతం ప్రెజరైజ్డ్‌ తరహా విమానాల దిగుమతికి 18 ఏళ్ల వరకు, అన్‌–ప్రెజరైజ్డ్‌ విమానాలకు 20 ఏళ్ల వరకు పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులను వరుసగా 20 ఏళ్లు, 25 ఏళ్లకు పెంచాలని ముసాయిదా ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు అధికారి వివరించారు. 10,000 అడుగుల పైన అత్యధిక ఎత్తులో ప్రయాణించగలిగే విమానాలను ప్రెజరైజ్డ్‌ విమానాలుగా, అంతకన్నా దిగువన ప్రయాణించే విమానాలను అన్‌ప్రెజరైజ్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌గా వ్యవహరిస్తారు. దేశీయంగా షెడ్యుల్డ్, నాన్‌–షెడ్యూల్డ్‌ కార్యకలాపాల కోసం విమానయాన సంస్థలు లీజుకు తీసుకున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య 800 పైచిలుకు ఉన్నాయి.

ఇటీవలి కాలంలో దేశీ విమానయాన సంస్థలు కార్యకలాపాలను విస్తరించేందుకు 1,400పైగా విమానాలకు ఆర్డర్లిచ్చాయి. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఏవియేషన్‌ మార్కెట్‌ అయిన భారత్‌లో 2030 నాటికల్లా ప్యాసింజర్ల రద్దీ రెట్టింపై 50 కోట్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి.

ఇదీ చదవండి: శాశ్వత నివాసం కోసం ఐర్లాండ్‌ ఆకర్షణీయ మార్గం

#

Tags : 1

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)