Breaking News

బంగారం బాటలో మరో మెటల్.. ఫుల్ డిమాండ్!

Published on Tue, 01/06/2026 - 21:04

బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో.. ఇతర లోహాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ప్లాటినం ధరలు కూడా దూసుకెళ్తున్నాయి, ఇదే వరుసలో రాగి రేటు కూడా అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు లిథియం కూడా ఇదే వరుసలోకి చేరింది.

బంగారం అనేది కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా.. మన దేశంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇండియాలో గోల్డ్‌ను సెంటిమెంట్‌గా భావించేవారి ఎక్కువగా ఉందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. దీనిని కొందరు ఆస్తిగా కూడా పరిగణిస్తారు. ఈ కారణాల వల్లనే ఇందులో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ఎక్కువగా ఉంది.

లిథియంకు డిమాండ్
ఇప్పుడు బంగారం, వెండి మాదిరిగానే.. లిథియంకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీనిని బ్యాటరీల తయారీలో, ఎలక్టిక్ వెహికల్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, కెమెరాలు, ల్యాప్‌టాప్‌లలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా.. ఇంధన, క్లిన్ ఎనర్జీ వంటి రంగాల్లో కూడా దీని వినియోగం చాలా ఎక్కువైంది. కాబట్టి చాలామంది ఇందులో కూడా పెట్టుబడులు పెడుతున్నారు.

సాధారణ లేదా పాత బ్యాటరీలతో పోలిస్తే.. లిథియం అయాన్ బ్యాటరీలు చాలా మన్నికైనవి. ఛార్జింగ్ కూడా వేగంగా ఉంటుంది. కాబట్టి దీనిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలు ఎక్కువగా వినియోగిస్తారు. రాబోయే రోజుల్లో ఈవీల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లిథియం డిమాండ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

ప్రపంచంలో ఎక్కువ లిథియం నిల్వలు
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ లిథియం నిల్వలు కలిగిన దేశాల జాబొత్యలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో చిలీ, అర్జెంటీనా, బొలీవియా, చైనా ఉన్నాయి. ఈ దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో లిథియం నిల్వలు కొంత తక్కువే. అయితే మనదేశంలో లిథియం నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జమ్మూ & కాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్ మొదలైనవి ఉన్నాయి. కాబట్టి.. భవిష్యత్తులో లిథియంను ఇండియా దిగుమతి చేసుకుపోవాల్సిన అవసరం వచ్చే అవకాశం లేకపోలేదు.

ఇదీ చదవండి: అటెన్షన్‌.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)