Breaking News

ఢిల్లీలో ఉద్రిక్తతలు.. TCS లొకేషన్‌ చేంజ్‌!

Published on Thu, 07/23/2026 - 14:48

జాతీయ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులు, సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ప్రముఖ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అప్రమత్తమైంది. ఢిల్లీ క్యాంపస్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగుల భద్రత, ఆటంకం లేని కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకొని వారిని నోయిడా లేదా గురుగ్రామ్‌లోని సమీప కార్యాలయాల నుంచి పనిచేయాలని సూచించింది.

సురక్షిత ప్రయాణం కోసం ముందస్తు అడ్వైజరీ

ఢిల్లీలోని జంతర్ మంతర్ పరిసరాల్లో కొనసాగుతున్న నిరసనలు, పార్లమెంట్ వైపు చేపట్టిన 'సంసద్ చలో' మార్చ్ కారణంగా ఢిల్లీ పరిధిలో రాకపోకలు ప్రభావితమయ్యాయి. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, మండి హౌస్, ఐటీఓ సహా కీలకమైన 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది.

దీనికి తోడు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించడంతో రోడ్డు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు ఆఫీసులకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండటంతో టీసీఎస్ హెచ్ఆర్ విభాగం ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ పరిస్థితికి కారణం..

జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన పరీక్షల నిర్వహణ వివాదాలు, నీట్ అక్రమాలపై జవాబుదారీతనం డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో విద్యార్థులు, యువజన సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పార్లమెంట్ ముట్టడి పిలుపుతో పోలీసు బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, లాఠీచార్జీలు జరగడంతో రాజధానిలోని వ్యాపార, ఐటీ రంగాలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నాయి.

ఇదీ చదవండి: మామిడి రసంలో పల్ప్‌ ఉంటేనే ట్యాక్స్‌ బెనిఫిట్‌

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)