Breaking News

ఖరీదైన అపార్ట్‌మెంట్‌ కొన్న దీపికా పదుకొణె కంపెనీ

Published on Wed, 09/18/2024 - 18:51

బాలివుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణెకు చెందిన సంస్థ కేఏ ఎంటర్‌ప్రైజెస్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసింది. ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో రూ.17.8 కోట్లకు 1845 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది.

ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌ల సమాచారాన్ని సేకరించే జాప్‌కీ సంస్థకు లభించిన పత్రాలు ఈ కొనుగోలు వివరాలను వెల్లడించాయి. ఈ సేల్ డీల్ సెప్టెంబర్ 12న నమోదైంది. ఎనార్మ్‌ నాగ్‌పాల్‌ రియాల్టీ సంస్థ విక్రేత కాగా దీపికా పదుకొణె కంపెనీ కేఏ ఎంటర్‌ప్రైజెస్ కొనుగోలుదారుగా పత్రాలు చూపించాయి.

పికా పదుకొణె కంపెనీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన సాగర్ రేషమ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఎనార్మ్ నాగ్‌పాల్ రియాల్టీ సంస్థ అభివృద్ధి చేసింది. ఇందులో 4బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. కంపెనీ కొనుగోలు చేసిన ఫ్లాట్ 15వ అంతస్తులో ఉంది. బిల్ట్-అప్ ఏరియా రేటు చదరపు అడుగుకు రూ. 96,400. ఈ డీల్‌కు స్టాంప్ డ్యూటీ దాదాపు రూ. 1.07 కోట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ. 30,000 చెల్లించినట్లు తెలుస్తోంది.

బాలివుడ్‌ స్టార్‌ కపుల్‌ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ ఇటీవలే తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. కాగా ఈ దంపతులు కొనుగోలు చేసిన మరొక ప్రాపర్టీ  షారూఖ్ ఖాన్ రాజభవనం మన్నత్‌కు సమీపంలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లో సముద్రానికి ఎదురుగా ఉన్న క్వాడ్రప్లెక్స్. దీని విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఈ జంట 2021లో అలీబాగ్‌లో రూ. 22 కోట్ల విలువైన బంగ్లాను కూడా కొనుగోలు చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)