Breaking News

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. కారణాలు..

Published on Wed, 07/08/2026 - 15:37

భారతీయ ఈక్విటీ మార్కెట్లకు ఈరోజు గందరగోళంగా మిగిలిపోయింది. గత కొన్ని సెషన్లుగా లాభాల బాటలో పయనిస్తున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా కుప్పకూలాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో భారీగా నష్టపోయాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి ప్రధాన సూచీ అయిన నిఫ్టీ 50 దాదాపు 2% పైగా (516 పాయింట్లు) క్షీణించి 23,882 స్థాయికి పడిపోగా, సెన్సెక్స్ కూడా 1677 పాయింట్లు నష్టపోయి 76,503 వద్దకు చేరింది.

మార్కెట్ పతనానికి కారణాలు

మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం పశ్చిమాసియా ఉద్రిక్తతలు. హార్మూజ్‌ జలసంధి వద్ద వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో ప్రతిచర్యగా అమెరికా పవర్ స్ట్రైక్స్ పేరిట దాడులు జరపడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఈ తరుణంలో యూఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌తో సీజ్‌ఫైర్‌ ముగిసినట్లు పేర్కొన్నారు. దాంతో మళ్లీ కఠిన ఆంక్షలు విధిస్తారేమోనని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు.

భగ్గుమన్న అంతర్జాతీయ ముడిచమురు ధరలు

భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడే దేశానికి ముడిచమురు ధరలు పెరగడం సవాలుగా మారుతుంది. నిన్నటి వరకు బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువన ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా ఏకంగా 2.5% పైగా పెరిగి 76 డాలర్ల మార్కును దాటింది. ఇది ద్రవ్యోల్బణ భయాలను పెంచడంతో మార్కెట్ సెంటిమెంట్‌ను పూర్తిగా దెబ్బతీసింది.

రూపాయి పతనం

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే డాలర్ వైపు మొగ్గు చూపారు. దీంతో డాలర్ ఇండెక్స్ 101.08 స్థాయికి చేరగా దేశీయ కరెన్సీ రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే ఏకంగా 20 పైసలు క్షీణించి 95.16 రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి పతనం విదేశీ ఇన్వెస్టర్లను కలవరపెట్టింది.

లాభాల స్వీకరణ

గత నాలుగు సెషన్లుగా మార్కెట్లు నిరంతరాయంగా లాభపడటంతో (సెన్సెక్స్ 1,800 పాయింట్లు, నిఫ్టీ 560 పాయింట్లకు పైగా పెరిగాయి) గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ముఖ్యంగా హెవీవెయిట్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పశ్చిమాసియా పరిణామాలు శాంతించే వరకు, అమెరికా ఫెడ్ సమావేశ నిర్ణయాలు వెలువడే వరకు ఇన్వెస్టర్లు తొందరపడి భారీ పెట్టుబడులు పెట్టకుండా వేచి చూసే ధోరణి అవలంబించడం ఉత్తమమని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి మార్కెట్‌ దిద్దుబాట్లు నాణ్యమైన షేర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మంచి అవకాశంగా మారుతాయని చెబుతున్నారు.

ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే..

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)