Breaking News

క్రూడ్ ఆయిల్ ధరలు ఢమాల్!

Published on Tue, 08/04/2026 - 19:25

అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 4 శాతం తగ్గి బ్యారెల్‌కు 77.11 డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచ చమురు మార్కెట్లలో సరఫరా, డిమాండ్ అంచనాలు, భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావంతో ధరల్లో ఈ భారీ మార్పు కనిపించింది.

ఇటీవల వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు కొంత స్థిరంగా ఉన్నప్పటికీ.. తాజాగా క్రూడ్ ఆయిల్ ధరలు క్షీణించాయి. ట్రేడింగ్ సమయంలో ధరలు వేగంగా పడిపోవడం మార్కెట్‌లో ఆందోళనకు దారితీసింది. దీనికి ప్రధాన కారణం అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చల్లో పురోగతి వస్తుందన్న అంచనాలు.

ప్రపంచంలోని కీలక చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గితే, భవిష్యత్తులో చమురు సరఫరా సులభతరం అవుతుందని మార్కెట్లు భావిస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా.. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఉన్న అనిశ్చితి కూడా చమురు ధరలపై ప్రభావం చూపుతోంది. ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తే ఇంధన డిమాండ్ తగ్గుతుందనే అంచనాలు ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి.

చమురు ధరలు తగ్గుదల.. వినియోగదారులకు కొంత ఊరటనిస్తుంది. ఎందుకంటే.. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలాగే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో కూడా ఇది సహాయపడవచ్చు.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)