Breaking News

ఒక్క ‘ముద్దు’తో రూ.25 వేల కోట్లు ఆవిరి!

Published on Fri, 06/12/2026 - 20:29

చైనా టెక్ రంగంలో సంచలనం రేపిన ఓ వ్యక్తిగత వివాదం, కేవలం కొన్ని గంటల్లోనే బిలియన్ల డాలర్ల మార్కెట్ విలువను తుడిచిపెట్టేసింది. చైనాకు చెందిన ప్రముఖ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీ సంస్థ విక్టరీ జెయింట్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు, చైర్మన్ చెన్ టావో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంపెనీ షేర్లు ఒక్కసారిగా భారీ ఒత్తిడికి గురయ్యాయి.

జూన్ 6న చైనా సోషల్ మీడియా వేదిక డౌయిన్‌లో "జెన్‌జెన్ జానిస్" పేరుతో ఉన్న ఓ యూజర్‌.. చెన్ టావోతో తనకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు ఆరోపిస్తూ పలు పోస్టులు చేసింది. అందులో లిఫ్ట్‌లో ఓ మహిళతో చెన్ టావో చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి దృశ్యాలు ఉన్నాయని చైనా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. చెన్ టావో వివాహితుడు కావడంతో ఈ వీడియోలు వేగంగా వైరల్ అయ్యి చైనా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

పడిపోయిన షేర్లు

ఈ వివాదం స్టాక్ మార్కెట్‌ను కూడా ప్రభావితం చేసింది. జూన్ 8న విక్టరీ జెయింట్ టెక్నాలజీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఒక దశలో కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 20 బిలియన్ యువాన్లు (దాదాపు 2.9 బిలియన్ డాలర్లు) భారత కరెన్సీలో సుమారు రూ.25 వేల కోట్లు ఆవిరయ్యాయి. అయితే మరుసటి రోజున పెట్టుబడిదారుల ఆందోళనలు కొంత తగ్గడంతో షేర్లు తిరిగి కోలుకున్నాయి.

వివాదంపై స్పందించిన కంపెనీ యాజమాన్యం.. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆరోపణలకు, సంస్థ కార్యకలాపాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఉత్పత్తి, ఆర్డర్లు, సరఫరా వ్యవస్థలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపింది. అలాగే ఈ వ్యవహారం కార్పొరేట్ గవర్నెన్స్ లేదా షేర్‌హోల్డర్లకు వెల్లడించాల్సిన కీలక అంశం కాదని పేర్కొంది. ఇక చెన్ టావో భవిష్యత్తు పాత్రపై వచ్చిన ప్రశ్నలకు మాత్రం "వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశం" అంటూ స్పందించేందుకు నిరాకరించింది.

54 ఏళ్ల చెన్ టావో స్థాపించిన విక్టరీ జెయింట్ టెక్నాలజీ అమెరికా ఏఐ చిప్ దిగ్గజం ఎన్విడియాకు ప్రధాన సరఫరాదారుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇటీవల హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో నిర్వహించిన భారీ ఐపీఓ ద్వారా సుమారు 2.6 బిలియన్ డాలర్లు సమీకరించి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ ప్రకారం.. చెన్ టావో వ్యక్తిగత సంపద సుమారు 11.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.లక్ష కోట్లు).

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)