Breaking News

చైనా సంచలనం.. అమెరికా చిప్‌ లేకుండా ‘బ్రెయిన్‌’ ఏఐ నమూనా

Published on Wed, 09/10/2025 - 19:44

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రంగంలో చైనా మరో కీలక అడుగు వేసింది. స్పైకింగ్‌బ్రెయిన్‌ 1.0 (SpikingBrain 1.0) అనే “మెదడు ప్రేరిత” లాంగ్వేజ్‌ మోడల్‌ను విడుదల చేసింది. ఇది ఎన్విడియా చిప్‌లు లేకుండానే సంప్రదాయ ఏఐ మోడళ్ల కంటే 100 రెట్లు వేగంగా పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.

ఈ మోడల్‌ను చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆటోమేషన్‌ అభివృద్ధి చేసింది. ఇది న్యూరోమార్ఫిక్ డిజైన్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే మన మెదడు లాగా, అవసరమైన న్యూరాన్లు మాత్రమే స్పందిస్తాయి. ఈ “స్పైకింగ్ కంప్యూటేషన్” పద్ధతి వల్ల విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. అలాగే ట్రైనింగ్‌ డేటా అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది.

స్పైకింగ్‌బ్రెయిన్‌.. చాట్‌జీపీటీ (ChatGPT) లాంటి మోడళ్లకు అవసరమైన ట్రైనింగ్‌ డేటాలో కేవలం 2 శాతం మాత్రమే ఉపయోగించి, వాటితో సమానమైన పనితీరును అందిస్తుందని ప్రాజెక్ట్ ప్రధాన పరిశోధకుడు లి గువోకి తెలిపారు. ఈ మోడల్ చైనాలోనే అభివృద్ధి చేసిన మెటాఎక్స్‌ చిప్‌లపై  పనిచేస్తుంది. అమెరికా జీపీయూ ఎగుమతి నియంత్రణలకు లోనవకుండా, స్వతంత్ర ఏఐ మౌలిక సదుపాయాల వైపు చైనా అడుగులు వేస్తోంది.

స్పైకింగ్‌బ్రెయిన్‌.. దాని డెమో సైట్ లో తనను తాను ఇలా పరిచయం చేసుకుంటుంది. "హలో! నేను స్పైకింగ్ బ్రెయిన్ 1.0, లేదా 'షుంక్సీ', మెదడు-ప్రేరేపిత ఏఐ మోడల్‌ని. మానవ మెదడు సమాచారాన్ని స్పైకింగ్ కంప్యూటేషన్ పద్ధతితో ప్రాసెస్ చేసే విధానాన్ని నేను మిళితం చేస్తాను. పూర్తిగా చైనీస్ టెక్నాలజీపై నిర్మించిన శక్తివంతమైన, నమ్మదగిన, శక్తి-సమర్థవంతమైన ఏఐ సేవలను అందించగలను" అంటోంది.

#

Tags : 1

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)