Breaking News

ప్రభుత్వ ఉద్యోగులను విదేశాలకు వెళ్లనీయని చైనా

Published on Sun, 08/03/2025 - 19:47

ప్రభుత్వ ఉద్యోగులపై చైనా ప్రభుత్వం వింత వింత ఆంక్షలు పెడుతోంది. ఉపాధ్యాయులు, వైద్యులు సహా ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులెవరినీ దేశం దాటి విదేశాలకు వెళ్లనీయడం లేదు. ప్రజల్లో సైద్ధాంతిక భావాలు సడలకుండా ఉండేందుకు, విదేశీ ప్రభావాన్ని అరికట్టడానికి, జాతీయ భద్రతను పెంచడానికి చైనా ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుంది.

కీలక ఆంక్షలు ఇవే..
పాస్ పోర్ట్ సరెండర్: చాలా మంది ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఇప్పుడు తమ పాస్ పోర్ట్ లను స్థానిక అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది.

వ్యక్తిగత ప్రయాణానికి అనుమతి తప్పనిసరి: విదేశాలలో వ్యక్తిగత సెలవులను కూడా యజమాన్యాలు లేదా స్థానిక ప్రభుత్వ విభాగాలు ఆమోదించాలి. అయితే విదేశీ పర్యటనలకు అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు.

విదేశాల్లో చదువుపై నిషేధం: చాలా ప్రావిన్సుల్లో విదేశాల్లో చదువుకున్న వ్యక్తులు ఇప్పుడు కొన్ని ప్రభుత్వ పదవులకు అనర్హులు.

వ్యాపార ప్రయాణ ఆంక్షలు: సాధారణ పరిశోధన, అధ్యయనం  ప్రయాణాలను కూడా అనేక ప్రాంతాలలో నిషేధించారు.

ఇదంతా ఎందుకంటే..
తమ దేశ ప్రజలపై ముఖ్యంగా విద్యావేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులలో విదేశీ సైద్ధాంతిక ప్రభావం గురించి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కువగా ఆందోళన చెందుతోంది. రాజకీయ క్రమశిక్షణ, పార్టీ పట్ల విధేయతను బలోపేతం చేసే విస్తృత ప్రచారంలో భాగంగా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాలతో ఉద్యోగుల వ్యక్తిగత, కుటుంబ సంబంధాలను కూడా అధికారులు మ్యాపింగ్ చేస్తున్నారు.

ఆంక్షల పరిధి, ప్రభావం
చైనా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ఆంక్షలు చైనా శ్రామిక శక్తిలో విస్తృత భాగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వ పట్టణ స్థానిక సంస్థలలో పనిచేసే సుమారు 16.7 కోట్ల మందిపై వీటి ప్రభావం పడుతోంది. కొన్ని నగరాల్లో రిటైరైన వారు కూడా తమ పాస​్‌పోర్టులను తిరిగి పొందడానికి రెండేళ్లు వేచి ఉండాల్సి వస్తుంది. కొంతమంది ఉద్యోగులనైతే సోషల్ మీడియా ఖాతాలను బహిర్గతం చేయాలని, తమ నివాస నగరాన్ని విడిచి వెళ్లేటప్పుడు రిపోర్ట్ చేయాలని అడుగుతున్నారట.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)