Breaking News

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో కొత్త స్పాన్సర్‌లు

Published on Fri, 11/28/2025 - 10:22

భారత్‌ ఇటీవల ఐసీసీ ఉమెన్‌ ప్రపంచ కప్‌ టోర్నీలో విజయం సాధించిన తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 వేలం అంచనాలను మించిపోయింది. ఆటగాళ్లకు కోట్ల రూపాయాలు ఇచ్చేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. దాంతోపాటు చాట్‌జీపీటీ, కింగ్‌ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, బిస్లెరీ వంటి ప్రముఖ సంస్థలు లీగ్‌లో కొత్త స్పాన్సర్‌లుగా చేరడం గమనార్హం. జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5, 2026 వరకు షెడ్యూల్ చేసిన నాలుగో ఎడిషన్ డబ్ల్యూపీఎల్‌ టోర్నమెంట్‌కు పెరుగుతున్న కార్పొరేట్ కంపెనీల ఆసక్తిని ఇది హైలైట్‌ చేస్తుంది.

ఐసీసీ ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ను గెలుచుకున్న టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ రూ.3.2 కోట్లతో ఈ వేలంలో అత్యధిక ధర సాధించారు. వేలం పూల్‌లో 73 స్లాట్‌ల కోసం 277 మంది ఆటగాళ్లు పోటీ పడ్డారు. అగ్రశ్రేణి క్రికెటర్ల కోసం ఫ్రాంచైజీలు గట్టిగానే ప్రయత్నించాయి. వేలంలో అధిక ధర సాధించిన కొందరు ఆటగాళ్ల వివరాలు కింది విధంగా ఉంది.

  • అమెలియా కెర్ (న్యూజిలాండ్): ముంబై ఇండియన్స్‌కు రూ.3 కోట్లు

  • శిఖా పాండే (భారత్): యూపీ వారియర్జ్‌ రూ.2.4 కోట్లు

  • సోఫీ డివైన్ (న్యూజిలాండ్): గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లు

  • మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా): యూపీ వారియర్జ్ రూ.1.9 కోట్లు

  • శ్రీచరణి (భారత్): ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.3 కోట్లు

  • చినెల్లె హెన్రీ (వెస్టిండీస్): ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.3 కోట్లు

  • ఆశా శోభన (భారత్): యూపీ వారియర్జ్ రూ.1.1 కోట్లు

స్పాన్సర్‌షిప్‌లు..

కొత్తగా చేరిన చాట్‌జీపీటీ, కింగ్‌ఫిషర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, బిస్లెరీ లీగ్‌కు మరింత బలాన్ని ఇచ్చాయి. బీసీసీఐ ప్రకటన ప్రకారం ఈ మూడు సంస్థల ఒప్పందాల విలువ రూ.48 కోట్లు. ఇది 2026, 2027 సీజన్లలో కొనసాగుతుంది. ఇప్పటికే ఉన్న అగ్రశ్రేణి భాగస్వాముల వివరాలు ఇలా ఉన్నాయి.

  • టాటా గ్రూప్ (టైటిల్ పార్టనర్)

  • సింటెక్స్, హెర్బాలైఫ్ (ప్రీమియర్ భాగస్వాములు)

  • సియట్ (స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్టనర్)

ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్‌ కోడ్స్‌ మాకొద్దు’.. అందులో ఏముంది?

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)