Breaking News

క్షణాల్లో ఫేక్‌ ఆధార్‌, పాన్‌ కార్డులు..

Published on Sat, 04/05/2025 - 09:39

ఏఐ.. అంటే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌.. దీని వినియోగం ఇటీవల విస్తృతంగా పెరిగిపోయింది. రోజుకో కొత్త ఏఐ టూల్‌ అందుబాటులోకి వస్తోంది. వీటిలో ప్రముఖమైంది ఓపెన్ఏఐ సంస్థ సృష్టించిన చాట్‌జీపీటీ. ఇది  విడుదలైనప్పటి నుండి వినియోగం ఎంత పెరిగిందో.. గోప్యతా సమస్యలనూ అంతే స్థాయిలో లేవనెత్తుతోంది.

ముఖ్యంగా కంటెంట్, చిత్రాల (ఇమేజ్) సృష్టికి సంబంధించి చాట్‌జీపీటీ సామర్థ్యం కలవరపెడుతోంది. అత్యంత వాస్తవికమైన, ఖచ్చితమైన కంటెంట్‌ను సృష్టించే కృత్రిమ మేధ సామర్థ్యం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఇది నకిలీ పత్రాలను సులభంగా సృష్టించడానికి వీలు కల్పిస్తోంది.

సాంప్రదాయకంగా ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు పత్రాలకు నకిలీవి సృష్టించడం కష్టతరంగా ఉంటుంది. కానీ జీపీటీ -4 దీనిని చాలా సులభతరం చేసింది. సమర్థవంతమైన, ఖచ్చితమైన ప్రాంప్ట్‌లను ఇవ్వడం ద్వారా మోసగాళ్లు సులభంగా నకిలీ పత్రాలను సృష్టించవచ్చని చాలా మంది ఔత్సాహిక సోషల్ మీడియా యూజర్లు ఇటీవల కనుగొన్నారు.

ఇలాంటి ఫోర్జరీ డాక్యుమెంట్ల చిత్రాలను కొందరు మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. "చాట్‌జీపీటీ నకిలీ ఆధార్, పాన్ కార్డులను క్షణాల్లో సృష్టిస్తోంది. ఇది తీవ్రమైన భద్రతా ప్రమాదం. అందుకే ఏఐని కొంతవరకు నియంత్రించాలి" అని ఓ యూజర్‌ రాసుకొచ్చారు. ఆధార్, పాన్ కార్డ్ డేటాసెట్లను ఏఐ కంపెనీలకు అమ్మి అటువంటి నమూనాలను తయారు చేస్తోంది ఎవరు? ఫార్మాట్ ను అంత కరెక్ట్ గా అది ఎలా తెలుసుకోగలదు...?" అంటూ మరో యూజర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)