బడ్జెట్ 2026: మౌలిక వసతులు, రక్షణ రంగాలకు ప్రాధాన్యం

Published on Sun, 02/01/2026 - 14:32

దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి దిశగా నడిపించే లక్ష్యంతో రూపొందించిన 2026-27 కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాల కల్పన, రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. మొత్తం రూ.53.47 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో కొన్ని రంగాలు అగ్రస్థానంలో నిలిచాయి.

కీలక రంగాల కేటాయింపులు (రూ.కోట్లలో)

  • రవాణా: రూ. 5,98,520 కోట్లు

  • రక్షణ: రూ. 5,94,585 కోట్లు

  • గ్రామీణాభివృద్ధి: రూ. 2,73,108 కోట్లు

  • హోం వ్యవహారాలు: రూ. 2,55,234 కోట్లు

  • వ్యవసాయం & అనుబంధ రంగాలు: రూ. 1,62,671 కోట్లు

  • విద్య: రూ. 1,39,289 కోట్లు

  • ఇంధనం: రూ. 1,09,029 కోట్లు

  • ఆరోగ్యం: రూ. 1,04,599 కోట్లు

  • పట్టణాభివృద్ధి: రూ. 85,522 కోట్లు

  • ఐటీ అండ్ టెలికాం: రూ. 74,560 కోట్లు

  • వాణిజ్యం & పరిశ్రమలు: రూ. 70,296 కోట్లు

  • సాంఘిక సంక్షేమం: రూ. 62,362 కోట్లు

  • శాస్త్ర సాంకేతిక విభాగాలు: రూ. 55,756 కోట్లు

  • పన్ను పరిపాలన: రూ. 45,500 కోట్లు

  • విదేశీ వ్యవహారాలు: రూ. 22,119 కోట్లు

  • ఆర్థిక శాఖ: రూ. 20,649 కోట్లు

  • ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి: రూ. 6,812

బడ్జెట్‌లో అత్యధికంగా రవాణా రంగానికి రూ.5.98 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా హైవేలు, రైల్వేలు, పోర్టుల ఆధునీకరణపై ప్రభుత్వం తన పట్టును చాటింది. దీనికి సమాంతరంగా రక్షణ రంగానికి రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు. సరిహద్దు భద్రతతో పాటు ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ రక్షణ పరికరాల తయారీకి ఈ నిధులు ఊతమివ్వనున్నాయి.

గ్రామీణ భారతం, వ్యవసాయం

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.2.73 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.1.62 లక్షల కోట్లు కేటాయించడం విశేషం. రైతుల ఆదాయం పెంచడం, డిజిటల్ అగ్రి-స్టాక్ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ఈసారి ప్రత్యేక దృష్టి సారించారు.

విద్య, ఆరోగ్యం, ఐటీ

మానవ వనరుల వికాసానికి ప్రాధాన్యత ఇస్తూ విద్యకు రూ.1.39 లక్షల కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.1.04 లక్షల కోట్లు కేటాయించారు. రాబోయే కాలంలో టెక్నాలజీ పాత్రను గుర్తిస్తూ ఐటీ, టెలికాం రంగానికి రూ.74,560 కోట్లు కేటాయించడం డిజిటల్ ఇండియా వేగాన్ని పెంచనుంది.

ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌ 2026 సమగ్ర స్వరూపం..

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)