Breaking News

బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ కోసం 5జీ ఫోన్‌ కొనాలా?

Published on Wed, 09/11/2024 - 15:49

ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు చార్జీలు పెంచేయడంతో చాలామంది ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు చూస్తున్నారు. ఇప్పటికే గణనీయంగా యూజర్లు ఇతర కంపెనీల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌లో చేరారు. వినియోగదారుల డిమాండ్‌కు తగ్గుట్టుగానే ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ 4జీ సేవలను విస్తృతం చేస్తోంది. అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు కొత్త సమస్య వచ్చింది. అదేంటంటే..

4జీ రోల్‌అవుట్ కోసం ఉపయోగిస్తున్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ల కారణంగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) కస్టమర్‌లు 4జీ సేవలను ఉపయోగించడానికి 5జీ-అనుకూల ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి రావచ్చు. 4G సేవలను అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ 2,100 MHz, 700 MHz అనే రెండు ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లను ఉపయోగిస్తోంది. వీటిలో 700 MHz బ్యాండ్‌ సాధారణంగా 5జీ సేవలకు సంబంధించిదైనా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలకు కూడా వినియోగిస్తోంది.

ఇతర టెలికాం ఆపరేట్లకు ఇచ్చినట్లే ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌కి కూడా 700 MHz బ్యాండ్‌ని కేటాయించింది. అయితే జియో వంటి వాణిజ్య ఆపరేటర్‌లు తమ స్వంత 5జీ నెట్‌వర్క్‌ కోసం దీనిని ఇంకా ఉపయోగించడం లేదు. ఈ బ్యాండ్‌ 5జీ సేవల కోసం ఇంకా పూర్తిగా స్థాపితం కాలేదు.దీంతో 2,100 MHz ఫ్రీక్వెన్సీ మాత్రమే సరిపోదన్న ఉద్దేశంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ 700 MHz బ్యాండ్‌ని కూడా 4జీ సేవలు అందించడానికి ఉపయోగిస్తోంది.

ఇదీ చదవండి: జియోలో అత్యంత చవకైన ప్లాన్‌ ఇదే..

ఈ సమస్య గురించి తెలిసిన ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌  700 MHz బ్యాండ్ (B28)తో పని చేసేలా 4జీ ఫోన్‌లను తయారు చేయాలని తయారీ కంపెనీలను కోరింది. రాబోయే హ్యాండ్‌సెట్‌లు 700 MHz బ్యాండ్‌లో 4జీ, 5జీ రెండింటికి సపోర్ట్‌ చేసేలా చూసేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్ తయారీదారులతో సమన్వయంతో పనిచేస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌  700 MHz బ్యాండ్‌తో పనిచేసే ఫోన్‌లు ప్రస్తుతం 1,000 మాత్రమే ఉన్నాయి.

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)