Breaking News

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 4జీ ఫోన్‌.. ఇక అంతా చవకే!

Published on Fri, 10/04/2024 - 20:01

ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) సొంత 4జీ మొబైల్ ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం కార్బన్ మొబైల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇతర టెలికాం సంస్థల కంటే చౌకగా ఉండే కొత్త ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ టారిఫ్ రేట్లను పెంచడంతో మొబైల్‌ యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో రీఛార్జ్ ప్లాన్‌లు చవగ్గా ఉండటమే ఇందుకు కారణం. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మరింత మంది వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ అడుగులు వేస్తోంది. తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. అంతటితో ఆగకుండా టైర్ 2, టైర్ 3 నగరాల్లోని వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి ఈ చవకైన 4జీ ఫోన్‌ను ప్రవేశపెడుతోంది.

ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త టెక్నాలజీ..

దేశంలోని ప్రతి మూలకు సరసమైన 4జీ కనెక్టివిటీని తీసుకురావడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌, కార్బన్ మొబైల్స్ చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాయి. దేశ "4జీ సాథీ పాలసీ" కింద ప్రత్యేక సిమ్ హ్యాండ్‌సెట్ బండ్లింగ్ ఆఫర్‌ను ప్రారంభించనున్నాయి. దేశవ్యాప్తంగా సరసమైన 4జీ కనెక్టివిటీని అందించడమే తమ లక్ష్యమని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒక పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఫోన్ బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌తో వస్తుంది. వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)