Breaking News

బీఎస్‌ఎన్‌ఎల్‌ దూకుడు! మరో మైలురాయికి చేరువలో,,

Published on Thu, 10/31/2024 - 19:49

ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్‌ఎన్‌ఎల్‌ దూసుకెళ్తోంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది జూలైలో తమ టారిఫ్ ధరలను పెంచినప్పటి నుండి బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తోంది. ప్రైవేట్ సంస్థల ప్లాన్‌ల కంటే చౌకగా ఉండే వివిధ రీఛార్జ్ ప్లాన్‌లను కూడా ప్రారంభించింది.

ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశవ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువ స్వదేశీ 4జీ సైట్‌లను దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో విజయవంతంగా ఏర్పాటు చేసిందని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అక్టోబర్ 29 వరకు ఇన్‌స్టాల్ చేసిన 50,000 సైట్‌లలో 41,000 సైట్‌లు ఇప్పుడు పనిచేస్తున్నాయని తెలిపింది.

దేశంలో లక్ష కొత్త టెలికాం టవర్‌ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.24,500 కోట్లు కేటాయించింది. ఇందు కోసం 4జీ పరికరాలను అందించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నేతృత్వంలోని కన్సార్టియం సహకారంతో ఆత్మ నిర్భర్ భారత్ చొరవ కింద గతేడాది మేలో ఒప్పందం చేసుకుంది.

వీటిలో దాదాపు 36,747 సైట్‌లు ఫేజ్‌ 9.2 కింద, 5,000 సైట్‌లు డిజిటల్ భారత్ నిధి ఫండ్ ద్వారా 4జీ శాచురేషన్‌ ప్రాజెక్ట్ కింద స్థాపితమయ్యాయి. "ఈ ప్రయత్నాలు 1,00,000 పైగా 4జీ సైట్‌లను విస్తరించాలనే బీఎస్‌ఎన్‌ఎల్‌ లక్ష్యాన్ని బలపరుస్తున్నాయి. ఇది దాని వేగవంతమైన విస్తరణకు నిదర్శనం" అని సమాచార శాఖ తెలిపింది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)