Breaking News

సల్మాన్‌  బ్రాండ్‌ న్యూ బుల్లెట్ ప్రూఫ్‌ కార్‌: ఇంటర్నెట్‌లో వీడియో హల్‌చల్‌

Published on Thu, 04/06/2023 - 11:31

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌ సూపర్‌లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయని కొత్త బుల్లెట్ ప్రూఫ్ ‘నిస్సాన్ పెట్రోల్ ఎస్‌యూవీ’ని సల్మాన్ ఖాన్ అంతర్జాతీయ మార్కెట్‌నుంచి  ప్రైవేట్‌గా దిగుమతి  చేసుకున్నట్టు తెలుస్తోంది. 

బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌ నిస్సాన్  అత్యంత ఖరీదైన  ఎస్‌యూవీని సొంతం చేసుకున్న సల్లూ భాయ్‌. ఈ వారం ముంబైలో తన వ్యక్తిగత భద్రత , స్థానిక పోలీసులతో పా తన కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ప్రయాణించినట్టు సమాచారం.  దీనికి సంబంధించిన వీడియోలను అనేక యూట్యూబ్ ఛానెల్‌లు షేర్ చేశాయి.  సల్మాన్ ఖాన్ కనిపించిన నిస్సాన్ పెట్రోల్ స్టైలిష్ వైట్ కలర్‌లో ముంబై వీధుల్లో చక్కర్లు  కొట్టారు. ముందు సల్మాన్ ఖాన్ వ్యక్తిగత భద్రత ఉన్న నల్లటి టయోటా ఫార్చ్యూనర్ ,వెనుక మహీంద్రా బొలెరో నియోలో పోలీసు అధికారులున్న వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. 

అత్యంత ఖరీదైన  నిస్సాన్‌ ఎస్‌యూవీ ఆగ్నేయాసియా మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి.  వ్యక్తిగత భద్రత రీత్యా బుల్లెట్‌ఫ్రూఫింగ్‌కు ఉత్తమ ఎంపికగా పరిగణించబడే అత్యంత సురక్షితమైన కారు  బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ పెట్రోల్ ఎస్‌యూని కొనుగోలు చేయడం విశేషం

5.6-లీటర్ వీ8 పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 405hp, 560Nm ని  అందించే ఈ ఇంజీన్‌లో   7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ కూడా ఉంది. సాధారణ కార్లలో కనిపించే వాటి కంటే మందంగా ఉండే కొత్త విండ్‌షీల్డ్‌తో పాటు మందపాటి క్లాడింగ్‌తో కూడిన విండో గ్లాసులను కూడా  ఇందులో జోడించారు.  

కాగా సల్మాన్ ఖాన్ గ్యారేజీలో ఇది మొదటి బుల్లెట్ ప్రూఫ్ SUV కాదు.  టయోటా ల్యాండ్ క్రూయిజర్  బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో అప్‌గ్రేడ్ చేశాడు.  వీటితోపాటు, Range Rover Autobiography, Audi RS7, Mercedes AMG GLE 63 S , Mercedes BenzGL-Class కూడా  సల్మాన్‌ ఖాన్‌ సొంతం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)