Breaking News

చరిత్రలోనే అతిపెద్ద స్టాక్‌మార్కెట్ క్రాష్‌ రాబోతోందా?

Published on Mon, 01/27/2025 - 16:24

ప్రఖ్యాత రచయిత, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తకాన్ని రచించిన రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) స్టాక్ మార్కెట్‌కు (stock market) సంబంధించి సంచలన జోస్యం చెప్పారు. "చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్" వచ్చే ఫిబ్రవరిలో సంభవిస్తుందని ఆయన అంచనా వేశారు. ఈ మేరకు ఆయన అందర్నీ అప్రమత్తం చేస్తూ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు.  

రాబోతున్న ఈ మహా పతనం సాంప్రదాయ పెట్టుబడి మార్కెట్లను అతలాకుతలం చేస్తుందని, అయితే వెంటనే మేల్కొని అప్రమత్తమయ్యేవారికి ఇది ఒక పెద్ద అవకాశంగా తాను చూస్తున్నట్లు కియోసాకి పేర్కొన్నారు. తన 2013 నాటి రిచ్ డాడ్‌  పుస్తకంలోనూ  కియోసాకి రాబోయే స్టాక్ మార్కెట్ క్రాష్ గురించి హెచ్చరించారు. గతంలో వచ్చిన అన్ని పతనాలు దీని ముందు దిగదుడుపే అని కూడా అందులో చెప్పారు.

2025 ఫిబ్రవరిలో స్టాక్‌ మార్కెట్‌ భారీ క్రాష్ సంభవించే అవకాశం ఉందని కియోసాకి తాజాగా చేసిన ట్వీట్.. ఆ పుస్తకంలోని జోస్యం నిజమవుతోందని సూచిస్తోంది. అయినప్పటికీ, దీని ద్వారా వినాశనం జరుగుతుందని కియోసాకి ఏమీ భావించడం లేదు. ఈ క్రాష్ గొప్ప కొనుగోలు అవకాశాన్ని అందిస్తుందని నమ్ముతున్నారు. "ఈ క్రాష్‌లో అన్నీ విక్రయానికి వస్తాయి" అని వివరించారు. మార్కెట్ పతనం సమయంలో కార్లు, ఇళ్లు వంటివి తక్కువ ధరకు వస్తాయంటున్నారు.

ఇది మంచి వార్తే..
కియోసాకి ప్రకారం ఇది మంచి వార్త. స్టాక్, బాండ్ మార్కెట్ల నుండి మూలధనం ప్రత్యామ్నాయ పెట్టుబడులలోకి, ముఖ్యంగా బిట్‌కాయిన్‌లోకి ప్రవహిస్తుంది. పెట్టుబడిదారులు సురక్షితమైన, మరింత లాభదాయకమైన ఎంపికలను వెతుకుతున్నందున, క్రిప్టోకరెన్సీ  భారీ వృద్ధిని అందుకుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. బిట్‌కాయిన్, బంగారం, వెండి వాటిలో పెట్టుబడులు పెట్టాలని కియోసాకి చాలా కాలంగా తన ఫాలోవర్లకు సూచిస్తున్నారు.

భవిష్యత్తు క్రిప్టోకరెన్సీదే..
సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి క్రిప్టోకరెన్సీ ఆదరణ పొందుతున్న నేపథ్యంలో బిట్‌కాయిన్‌ను సురక్షిత స్వర్గంగా కియోసాకి అభివర్ణిస్తున్నారు. మార్కెట్ అస్థిరత సమయంలో బిట్‌కాయిన్ వృద్ధికి ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుందని, ముఖ్యంగా స్టాక్‌లు, బాండ్‌లు వంటి సాంప్రదాయ ఆస్తులు తమ ఆకర్షణను కోల్పోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

బిట్‌కాయిన్‌లో అతి చిన్న యూనిట్ అయిన సతోషి ఉ‍న్నా కూడా గణనీయమైన సంపదకు దారితీస్తుందని కియోసాకి నొక్కిచెబుతున్నారు. 100 మిలియన్ల సతోషిలు కలిపితే ఒక బిట్‌కాయిన్‌.  కియోసాకి అంచనా వేసిన మార్కెట్ క్రాష్ సమయం సమీపిస్తున్న కొద్దీ ఇన్వెస్టర్లలో గుబులు పుడుతుంటే ఆయన జోస్యం నిజమవుతుందా లేదా అని ప్రపంచం నిశితంగా గమనిస్తోంది.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)