బెర్క్‌షైర్ హాత్‌వే కొత్త సీఈఓ: వేతనం ఎన్ని కోట్లంటే?

Published on Sun, 01/11/2026 - 21:15

ప్రముఖ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' బెర్క్‌షైర్ హాత్‌వే సీఈఓగా వైదొలగిన తరువాత.. 'గ్రెగ్ అబెల్' బాధ్యతలు స్వీకరించారు. ఈయన కేవలం బఫెట్ వారసుడిగానే మాత్రమే కాకుండా.. అమెరికాలో అత్యధిక పారితోషికం పొందుతున్న ప్రముఖులలో ఒకరుగా నిలిచారు.

2026 సంవత్సరానికి అబెల్ వార్షిక వేతనం 25 మిలియన్ డాలర్లు. ఇది 2024లో తీసుకున్న వేతనం కంటే 19 శాతం ఎక్కువ. అంతే కాకుండా ఈ జీతం వారెన్ బఫెట్ వేతనం కంటేఎక్కువ కావడం గమనార్హం.

95 సంవత్సరాల వయసులో.. వారెన్ బఫెట్ పదవీ విరమణ చేసిన తరువాత, ఈ ఏడాది జనవరి 1 నుంచి గ్రెగ్ అబెల్ అధికారికంగా సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన సీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు.. బెర్క్‌షైర్ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. అంతే కాకుండా కంపెనీకి చెందిన నాన్ ఇన్సూరెన్స్ ఆపరేషన్స్‌ను కూడా పర్యవేక్షించారు.

కెనడాలోని ఎడ్మంటన్‌లో జన్మించిన గ్రెగ్ అబెల్, బఫెట్‌కు అత్యంత సన్నిహిత సహాయకుడిగా పేరుపొందారు. ఆయన వద్ద ప్రస్తుతం సుమారు 171 మిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ షేర్లు ఉన్నాయి. 2022లో బెర్క్‌షైర్ హాత్‌వే ఎనర్జీలో తన 1 శాతం వాటాను కంపెనీకే విక్రయించి 870 మిలియన్ డాలర్లు పొందారు. ఇప్పుడు సీఈవోగా బాధ్యతలు చేపట్టిన గ్రెగ్ అబెల్, బెర్క్‌షైర్ హాతవేను కొత్త యుగంలోకి నడిపించడమే కాకుండా.. అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోలలో ఒకరిగా నిలిచారు.

ఇదీ చదవండి: 2026లో ఊహించని స్థాయికి బంగారం, వెండి!

Videos

దద్దరిల్లుతున్న ఇరాన్.. ఖమేనీ ఫోటో కాల్చి సిగరెటికి నిప్పు

ఏపీలో వివాదాస్పదంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తీరు

అయ్యా ABN మెంటల్ కృష్ణ.. రాధా కృష్ణ తుక్కు రేగొట్టిన నాగమల్లేశ్వరి

మిగిలేది ఆవకాయ తొక్కే.. బాబు, పవన్ పై బైరెడ్డి సెటైర్లే సెటైర్లు

కండలేరు వద్దకు వెళ్తున్న YSRCP నేతల అక్రమ అరెస్ట్

చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం.. పండగ పూట కూలీల పస్తులు

మన శంకరవరప్రసాద్ గారు మూవీ పబ్లిక్ టాక్

సంక్రాంతి కిక్కు.. జీవో రాకముందే మద్యం ధరల పెంపు

దళపతి విజయ్ అరెస్ట్..?

దూసుకొచ్చిన కారు.. సాక్షి రిపోర్టర్ కు గాయాలు

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)

+5

సాక్షి-ఎస్పీఆర్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు (ఫోటోలు)