Breaking News

మొదటిసారి అప్పు చేస్తున్నారా?

Published on Thu, 09/04/2025 - 11:24

అత్యవసరాలకు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కొన్నిసార్లు అప్పు చేయడం తప్పదు. అయితే అప్పు తీసుకోవాలనుకుంటే క్రెడిట్‌ స్కోర్‌ తప్పకుండా ఉండాలని చాలా మంది భావిస్తుంటారు. దాంతో మొదటిసారి అప్పు చేయాలంటే సిబిల్‌ లేదనే ఉద్దేశంతో బ్యాంకుల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా అప్పు చేసి అధిక వడ్డీలు చెల్లిస్తుంటారు. అలాంటి వారికోసం బ్యాంకులు ఇతర ప్రత్యామ్నాయ డేటాను ఉపయోగించి రుణాలు మంజూరు చేస్తున్నాయి. క్రెడిట్ హిస్టరీ లేని న్యూ-టు-క్రెడిట్ (ఎన్‌టీసీ) కస్టమర్లకు రుణాలను విస్తరించాలని బ్యాంకులను కోరిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా ఆదేశాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.

సంప్రదాయకంగా క్రెడిట్ బ్యూరో స్కోరు(సిబిల్‌) రుణ ఆమోదం ప్రక్రియలో కీలక నిర్ణయాంశంగా ఉంది. తగినంత లేదా క్రెడిట్ చరిత్ర లేకపోవడం వల్ల చాలా మంది రుణాలకు దూరంగా ఉంటున్నారు. అందులో కొందరు ఇతర మార్గాలు, అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని ఇబ్బందులు పడుతున్నారు. మొదటిసారి రుణాలు పొందేవారికి క్రెడిట్‌ హిస్టరీ ఉండదు కాబట్టి అలాంటి వారి రుణ అర్హతను అంచనా వేయడానికి బ్యాంకులు విస్తృత సూచికలను పాటిస్తున్నాయి.

ప్రత్యామ్నాయ డేటా వనరులు

ఎన్‌టీసీ కస్టమర్లకు రుణాలు మంజూరు చేయడానికి  యుటిలిటీ పేమెంట్స్, మొబైల్, టెలికాం బిల్లులు, యూపీఐ ట్రాన్సాక్షన్స్, ఈ-కామర్స్ బిహేవియర్ వంటి ప్రత్యామ్నాయ డేటా వనరులను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రజనీష్ కార్ణటక్‌ అన్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారి రుణగ్రహీతలకు 16 శాతం రుణాలను మాత్రమే బ్యాంకులు మంజూరు చేశాయని, మిగిలినవి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. ఈ వ్యత్యాసం రుణగ్రహీతలకు సంబంధించి నిర్మాణాత్మక డేటా అందుబాటులో లేకపోవడం వల్ల ఏర్పడిందని కార్ణటక్‌ తెలిపారు.

ఎన్‌టీసీ రుణగ్రహీతలకు మద్దతు

ప్రభుత్వం కూడా ఎన్‌టీసీ రుణగ్రహీతలకు మద్దతుగా నిలుస్తోంది. వీరికి రుణాలు ఇవ్వడానికి ఆర్‌బీఐ కనీస క్రెడిట్ స్కోర్‌ను తప్పనిసరి చేయలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల స్పష్టం చేశారు. జనవరి 6, 2025 నాటి ఆర్‌బీఐ మాస్టర్ డైరెక్షన్‌ను ప్రస్తావిస్తూ ‘మొదటిసారి రుణగ్రహీతలకు క్రెడిట్ హిస్టరీ అవసరం లేదు.. కాబట్టి వారి రుణ దరఖాస్తులను తిరస్కరించకూడదు’ అని చౌదరి నొక్కి చెప్పారు.

ఇదీ చదవండి: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు చెక్‌ పెట్టాలి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)