Breaking News

ఈ వారం బ్యాంకులకు వరుస సెలవులు.. ఎందుకంటే..

Published on Mon, 08/25/2025 - 11:36

ఈ వారం బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ఆగస్టు 25 నుంచి 31వ తేదీ వరకూ ఏయే రోజుల్లో బ్యాంకు సెలవులు ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ఆర్బీఐ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద పండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ఈ వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు.

బ్యాంకింగ్ లావాదేవీలు లేదా ఇతర సేవలకు సంబంధించి నేరుగా బ్యాంకు శాఖల్లో ముఖ్యమైన కార్యకలాపాలను ప్లాన్ చేసేవారి కోసం ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాం. ఈ వారం ఏయే రోజుల్లో ఎక్కడెక్కడ బ్యాంకులకు సెలవులు ఉంటాయో ఆ ఆజాబితాను తెలియజేస్తున్నాం. తదనుగుణంగా ప్లాన్ చేసుకుని చివరి నిమిషంలో అసౌకర్యాన్ని నివారించవచ్చు.

ఇదిగో సెలవుల జాబితా..

  • ఆగస్టు 25 (సోమవారం) - శ్రీమంత శంకరదేవుని తిరుభవ్ తిథి కారణంగా గౌహతి (అస్సాం) లో బ్యాంకులకు సెలవు

  • ఆగస్టు 27 (బుధవారం) - వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో సెలవు.

  • ఆగస్టు 28 (గురువారం) - గణేష్ చతుర్థి (రెండవ రోజు) / నువాఖై కారణంగా భువనేశ్వర్, పనాజీలో బ్యాంకుల మూసివేత

  • ఆగస్టు 31 (ఆదివారం) - వారాంతపు సెలవు దినం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని చోట్ల బ్యాంకుల మూసివేత

  • ప్రాంతీయ, స్థానిక ఆచార సంప్రదాయాల కారణంగా దేశంలో సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు.

చెక్కులు, ప్రామిసరీ నోట్ల జారీకి సంబంధించిన నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం బ్యాంక్ వార్షిక హాలిడే క్యాలెండర్‌ను ఆర్బీఐ ప్రకటిస్తుంది. అందువల్ల ఈ లిస్టెడ్ సెలవు దినాల్లో ఈ సాధనాలకు సంబంధించిన లావాదేవీలు అందుబాటులో ఉండవు.

బ్యాంకు సెలవులు శాఖ కార్యకలాపాలను తాత్కాలికంగా ప్రభావితం చేసినప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ మీ లావాదేవీలు సజావుగా కొనసాగేలా చేస్తుంది.

నగదు అత్యవసరాల కోసం ఏటీఎంలు యథావిధిగా విత్ డ్రా చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌ చెల్లింపుల కోసం సంబంధిత బ్యాంక్ యాప్, పయూపీఐని కూడా ఉపయోగించవచ్చు.

ఇదీ చదవండి: బంగారం ధరలకు బ్రేక్‌.. తులానికి ఎంతంటే..

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)