Breaking News

వచ్చే నెలలో బ్యాంకులకు వరుస సెలవులు

Published on Wed, 09/25/2024 - 18:47

సెప్టెంబర్ నెల ముగింపునకు వచ్చేసింది. కొత్త నెల త్వరలో ప్రారంభం కానుంది. రానున్న అక్టోబర్ నెలలో పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులకు చాలా రోజులు సెలవులు ఉండబోతున్నాయి. శారదీయ నవరాత్రి నుండి దసరా, దీపావళి వరకు సెలవుల కారణంగా బ్యాంకులు ఖాతాదారులకు అందుబాటులో ఉండవు.

బ్యాంకులు ప్రతిఒక్కరి జీవితంలో భాగమయ్యాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని మీద బ్యాంకులకు వెళ్లాల్సిన వస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో బ్యాంకుల్లో పని ఉన్నవారు సెలవులకు అనుగుణంగా ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వచ్చే నెలలో ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయి.. ఏయే రోజుల్లో బ్యాంకులు మూసిఉంటాయి అన్న సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం..

సెలవుల జాబితా ఇదే.. 
» అక్టోబర్ 1- అసెంబ్లీ ఎన్నికల కారణంగా జమ్మూలో బ్యాంకుల మూత
» అక్టోబర్ 2- గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు
» అక్టోబర్ 3 - నవరాత్రి స్థాపన కారణంగా జైపూర్‌లో సెలవు
» అక్టోబర్ 6- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా సెలవు.
» అక్టోబర్ 10- దుర్గాపూజ, దసరా, మహాసప్తమి కారణంగా త్రిపుర, అస్సాం, నాగాలాండ్‌, పశ్చమ బెంగాల్‌లో బ్యాంకుల మూత
» అక్టోబర్ 11- దసరా, మహా అష్టమి, మహానవమి, ఆయుధ పూజ, దుర్గా అష్టమి, దుర్గాపూజ కారణంగా అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ,  షిల్లాంగ్‌లలో సెలవు
» అక్టోబర్ 12- దసరా, విజయదశమి, దుర్గాపూజ కారణంగా దాదాపు దేశవ్యాప్తంగా సెలవు
» అక్టోబర్ 13- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకుల మూత
» అక్టోబర్ 14- దుర్గాపూజ లేదా దాసైన్ కారణంగా గాంగ్‌టక్‌లో సెలవు
» అక్టోబర్ 16- లక్ష్మీ పూజ సందర్భంగా అగర్తల, కోల్‌కతాలో బ్యాంకుల మూత
» అక్టోబర్ 17- మహర్షి వాల్మీకి జయంతి, కాంతి బిహు సందర్భంగా బెంగళూరు, గౌహతిలో సెలవు
» అక్టోబర్ 20- ఆదివారం దేశవ్యాప్తంగా హాలిడే
» అక్టోబర్ 26- నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా సెలవు
» అక్టోబర్ 27- ఆదివారం దేశవ్యాప్త హాలిడే
» అక్టోబర్ 31- దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు

అక్టోబర్‌లో పండుగల సీజన్ కారణంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. ఆయా రోజుల్లో పని చేయవు. బ్యాంకులు అందుబాటులో లేనప్పటికీ చాలా పనులను ఆన్‌లైన్‌ ద్వారా పూర్తి చేసుకోవచ్చు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?