Breaking News

అక్టోబర్‌లో భారీగా బ్యాంక్ సెలవులు

Published on Wed, 09/27/2023 - 20:27

రానున్న అక్టోబర్ నెలలో బ్యాంకులకు అత్యధికంగా సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం అక్టోబర్‌లో 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 

(RBI Penalty: బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా)

అక్టోబర్‌ సెలవుల జాబితాలో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు వంటి సాధారణ సెలవులు 7 ఉన్నాయి. మరోవైపు ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. పండుగ లేదా గెజిట్ హాలిడేస్‌ 11 ఉన్నాయి. వీటిలో కొన్ని బ్యాంకు సెలవులు ప్రాంతీయంగా ఉంటాయి. మరికొన్ని రాష్ట్రానికి రాష్ట్రానికి, బ్యాంకుకు బ్యాంకుకు భిన్నంగా ఉండవచ్చు.

(గడువు ముగియనున్న ఎల్‌ఐసీ సింగిల్‌ ప్రీమియం పాలసీ)

అక్టోబర్‌ నెల ప్రారంభంలోనే మొదటి రెండు రోజులు వరుసుగా సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 1వ తేదీ ఆదివారం కాగా అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 24న దసరా కారణంగా హైదరాబాద్, ఇంఫాల్ మినహా చాలా బ్యాంకులు మూతపడనున్నాయి.

అక్టోబర్ సెలవుల జాబితా ఇది.. 

  • అక్టోబర్ 1: ఆదివారం
  • అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి
  • అక్టోబర్ 8: ఆదివారం
  • అక్టోబర్ 14: రెండవ శనివారం
  • అక్టోబర్ 14: మహాలయ (కోల్‌కతా)
  • అక్టోబర్ 15: ఆదివారం
  • అక్టోబర్ 18: కటి బిహు (గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా)
  • అక్టోబర్ 21: దుర్గాపూజ (అగర్తలా, గౌహతి, ఇంఫాల్, కోల్క్‌జాతా)
  • అక్టోబర్ 22: ఆదివారం
  • అక్టోబర్ 23: దసరా, ఆయుధ పూజ, దుర్గాపూజ, విజయ దశమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కాన్పూర్, కొచ్చి, కోహిమా, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం).
  • అక్టోబర్ 24: దసరా/దుర్గాపూజ (హైదరాబాద్ మరియు ఇంఫాల్ మినహా... భారతదేశం అంతటా)
  • అక్టోబర్ 25: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్)
  • అక్టోబర్ 26: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్, జమ్ము, శ్రీనగర్)
  • అక్టోబర్ 27: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్)
  • అక్టోబర్ 28: లక్ష్మీ పూజ (కోల్‌కతా)
  • అక్టోబర్ 28: నాల్గవ శనివారం
  • అక్టోబర్ 29: ఆదివారం
  • అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అహ్మదాబాద్)

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)