Breaking News

త్వరలో ఆర్థిక మాంద్యం!

Published on Thu, 04/17/2025 - 14:47

అమెరికా సుంకాలు ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని ప్రేరేపిస్తే కెనడాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, దేశం తీవ్ర మాంద్యంలోకి వెళ్తుందని బ్యాంక్ ఆఫ్ కెనడా తెలిపింది. తీవ్ర అనిశ్చితి కారణంగా సెంట్రల్ బ్యాంక్ తన సాధారణ త్రైమాసిక ఆర్థిక అంచనాలను విడుదల చేయలేదు. దానికి బదులుగా భవిష్యత్తులో యూఎస్‌ ఆర్థిక వైఖరి కెనడాపై ఎలా ప్రభావం చూపుతుందో అంచనా వేసింది.

బ్యాంక్ ఆఫ్ కెనడా తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి సందర్భంలో, చాలా సుంకాలు రద్దు చేస్తారు. కెనడాతోపాటు ప్రపంచ వృద్ధి తాత్కాలికంగా బలహీనపడుతుంది. కెనడా ద్రవ్యోల్బణం సంవత్సరానికి 1.5%కు పడిపోతుంది. తరువాత 2%కు చేరుతుంది. రెండో సందర్భంలో, సుంకాలు దీర్ఘకాలిక ప్రపంచ వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయి. కెనడా భారీ మాంద్యంలోకి ప్రవేశిస్తుంది. ద్రవ్యోల్బణం 2026 మధ్యలో 3% కంటే ఎక్కువ పెరిగి 2% కు తిరిగి వస్తుంది. ఇంకా ఇతర పరిస్థితులు సాధ్యమేనని నొక్కిచెప్పిన బ్యాంక్ వార్షిక మొదటి త్రైమాసిక జీడీపీ 1.8%గా అంచనా వేసింది. ఇది జనవరి చివరిలో అంచనా వేసిన 2.0% కంటే తక్కువ.

ఇదీ చదవండి: ‘చౌకైన కార్లు కనుమరుగయ్యే ప్రమాదం’

ద్వితీయార్ధంలో ఆర్థిక మాంద్యం..?

వాణిజ్య ఉద్రిక్తతలు, ద్రవ్య సర్దుబాట్ల పర్యవసానాలతో ఇన్వెస్టర్లు, విధాన నిర్ణేతలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో రానున్న రోజుల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఆర్థిక మాంద్యం ప్రమాదాలు పెరగవచ్చని చెబుతున్నారు. అందుకోసం ప్రభుత్వ వ్యూహాత్మక ఆర్థిక జోక్యాలు అవసరమని సూచిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)