Breaking News

అతి తక్కువ ధరకే ప్రభుత్వ డబుల్‌ బెడ్రూం ఫ్లాట్లు, ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం!

Published on Fri, 06/30/2023 - 16:42

Double Bedroom Flats : 14 ఫ్లోర్లు, 630 డబుల్‌ బెడ్రూం ఫ్లాట్లు. ఒక్కో ఫ్లోర్‌లో 1370 స్క్వైర్‌ ఫీట్లలో 2 బీహెచ్‌కే నిర్మాణం. ఇప్పుడా ఫ్లాట్లను అమ్మేందుకు బెంగళూరు డెవలప్‌మెంట్‌ అథారిటీ (బీడీఏ) సిద్ధమైంది. కొనుగోలు దారులకు హోమ్‌లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు సైతం అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. ఫలితంగా 2బీహెచ్‌కే ఫ్లాట్‌ ధరలు తక్కువ ధరకే అమ్ముతుండడంతో కొనుగోలు దారులు పెద్ద ఎత్తున అప్లయి చేసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

బెంగళూరు ఈస్ట్‌ కోనదాసపూర్ ప్రాంతంలో బీడీఏ 14 ఫ్లోర్‌లలో అపార్ట్‌మెంట్‌ నిర్మాణాలు చేపట్టింది.ఈ అపార్ట్‌మెంట్లలో నిర్మించిన 630 ఫ్లాట్లను అమ్మేందుకు జులై 1 ప్రత్యేకం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. 1370 స్కైర్‌ ఫీట్‌లో రెండు బెడ్‌రూమ్‌లు, హాలు, కిచెన్‌ సౌకర్యాలు ఉన్నాయి. 1370 స్కైర్‌ ఫీట్‌లలో 806 స్కైర్‌ ఫీట్‌లలో కార్పెట్‌ ఏరియాను కేటాయించింది. ఒక్కో ఫ్లాట్‌ను ఒక్కో ధరకు అమ్మనుంది. ఎలక్ట్రిసిటీ, వాటర్‌ సప్లయి ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 

కార్‌పార్కింగ్‌ కోసం అదనం
నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ల గృహ కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్‌కు ముందు అపార్ట్‌మెంట్ల జోన్ ఆధారంగా తగిన మొత్తానికి వేర్వేరుగా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని బీడీఏ అధికారులు తెలిపారు. అదనంగా, కేటాయింపుదారులు సంబంధిత కాలానికి విడిగా జీఎస్టీ చెల్లించాలి. అందుబాటులో ఉన్న కవర్డ్ కార్ పార్కింగ్ స్థలం కోసం ప్రతి ఇంటికి అదనంగా రూ .2 లక్షలు ఖర్చవుతుందని అధికారులు పేర్కొన్నారు.   

ఫ్లోర్‌ను బట్టి ధర మారుతుంది
ఫ్లాట్ల కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందు 24 నెలల మెయింటెనెన్స్ మొత్తాన్ని చెల్లించాలని బీడీఏ అధికారులు చెబుతున్నారు. మెయింటెనెన్స్ మొత్తం చెల్లించిన తర్వాత బీడీఏ స్వయంగా ఫ్లాట్లను రిజిస్టర్ చేస్తుంది. ఫ్లోర్ లెవల్‌ను బట్టి రెండు బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ ధర మారుతుంది.

మొదటి అంతస్తు ఫ్లాట్‌ ధర ఎంతంటే?
మొదటి అంతస్తు నుంచి ఐదో అంతస్తు ఫ్లాట్ ధర రూ.48 లక్షలు, ఆరో అంతస్తు ధర రూ.48.24 లక్షలు, ఏడో అంతస్తు ధర రూ.48.72 లక్షలు. ఎనిమిదో అంతస్తు అపార్ట్ మెంట్ ధర రూ.48.96 లక్షలు. తొమ్మిదో అంతస్తు నుంచి 12వ అంతస్తు వరకు రూ.49.2 లక్షల నుంచి రూ.49.92 లక్షల వరకు ధరలు ఉన్నాయి. 13వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ ధర సుమారు రూ.50.16 లక్షలు కాగా, 14వ అంతస్తు ధర సుమారు రూ.50.4 లక్షలు.

అంతేకాకుండా ఈ భవనంలోని ప్రీమియం ఫ్లాట్ల ధర ఎక్కువగా ఉంటుంది. మొదటి అంతస్తు నుంచి ఐదో అంతస్తు వరకు రూ.50.4 లక్షలు, ఆరో అంతస్తు నుంచి 13వ అంతస్తు వరకు రూ.50.65 లక్షల నుంచి రూ.52.65 లక్షల వరకు ధరలు ఉంటాయని బీడీఏ అధికారులు తెలిపారు.

చదవండి👉 సొంతిల్లు కొంటున్నారా?, కేంద్ర ప్రభుత్వ రివర్స్‌ మార్ట్‌గేజ్‌ పథకం గురించి తెలుసా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)