Breaking News

‘చాట్‌జీపీటీ అద్భుతం చేసింది’, యువతికి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అవార్డ్‌!

Published on Fri, 01/26/2024 - 15:07

చాట్‌జీపీటీ! టెక్ ప్ర‌పంచంలో ఇప్పుడు ఏ న‌లుగురు ఒక చోట క‌లిసినా దీనిపేరే విన‌బ‌డుతుంది. అంత‌కు మించి జాబ్ మార్కెట్‌ను శాసించే స్థాయికి చేరుకోవ‌డంతో.. అత్యంత కీల‌క రంగ‌మైన టెక్నాల‌జీతో పాటు ఇత‌ర రంగాల్లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దీనికి తోడు ప్ర‌ముఖ జాతీయ, అంత‌ర్జాతీయ కంపెనీలన్నీ చాట్‌జీపీటీని వినియోగిస్తున్నాయి. ఉద్యోగుల్ని తొల‌గిస్తున్నాయి. దీంతో చాట్జీపీటీ పేరు వింటేనే ఉద్యోగ‌స్తులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. 

అయితే, ఈ త‌రుణంలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ చాట్‌జీపీటీ టూల్స్‌తో ఉద్యోగాలు పోతాయ‌నే ఆందోళ‌న‌ను ప‌క్క‌న పెట్టేసి..దాన్ని స‌ద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు చేయొచ్చ‌ని అంటుంది ఓ యువ‌తి. అంతేకాదు, చేసి చూపించింది కూడా. ఈ ఏఐ టూల్‌ను ఉప‌యోగించి దేశంలోనే అత్యున్న‌త పుర‌స్కారాన్ని సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ అంశం టెక్ ప్ర‌పంచంలో ఆస‌క్తిక‌రంగా, ఆందోళ‌నక‌రంగా మారింది. ఎందుకంటే? 


అకుటగావా అవార్డు ప్రధానం 
జపాన్‌కు చెందిన రీ కుడాన్ 33 ఏళ్ల సాహితి వేత్త (Literary scholar). ఇటీవ‌ల ఆమె సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మకమైన జ‌పాన్‌ సాహిత్య పురస్కారం ‘అకుటగావా’ అవార్డును సొంతం చేసుకున్నారు. అకుటగావా అవార్డును సాహిత్య రంగంలో అస‌మాన‌మైన ప్ర‌తిభ‌ను క‌న‌బరిచినందుకు గాను జ‌పాన్ ప్ర‌భుత్వం ప్ర‌ధానం చేస్తుంది. తాజాగా, అకుట‌గావాను టోక్యో-టు డోజో-టు  (టోక్యో సానుభూతి టవర్) పేరుతో న‌వ‌ల రాసిన  రచయిత్రి కుడాన్ పేరును  జపాన్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.    


చాట్‌జీపీటీతో అద్భుతాలు

ఈ నేపథ్యంలో కుడాన్ తాను రాసిన న‌వ‌ల‌కు అవార్డును సొంతం చేసుకున్నందుకు సంతోషం వ్య‌క్తం చేశారు. ఏఐ టూల్ చాట్ జీపీటీతో ఇది సాధ్యమైందంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ‘ఇది చాట్‌జీపీటీ ఉప‌యోగించి రాసిన న‌వ‌ల‌. ఇందులో మొత్తం 5 శాతం మాత్ర‌మే నేరుగా రాసింది. వ‌ర్క్ ప్రొడ‌క్టివిటీ విష‌యంలో, నాలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు చాట్‌జీపీటీని మ‌రింత‌గా వినియోగించాల‌ని అనుకుంటున్నాను’ అని అన్నారు.   

ప్రశంసలు.. విమర్శలు 
కుడాన్ నవలపై దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఏఐని ఉప‌యోగించి తాను ఈ నవల రాసినట్లు బ‌హిర్గ‌తం చేయ‌డం వివాదాస్ప‌దంగా మారింది. సాహిత్యంతో పాటు ఇత‌ర అత్యున్నత పుర‌స్కాల కోసం ఏఐని ఉప‌యోగించేందుకు రచ‌యిత‌లు పోటీప‌డ‌తారేమోన‌న్న సందేహాలు నెల‌కొన్నాయి. దీనిపై ఇప్పుడు జపాన్ ర‌చయిత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. చాట్‌జీపీటీని ఉప‌యోగించే రాసే ర‌చ‌న‌లకు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌ను అందిస్తారా? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. మ‌రి ఈ అంశంపై జపాన్‌ ప్రభుత్వంతో పాటు కుడాన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)