ఇన్‌స్టాలో 90% విరాళాల ఖాతాలు అనుమానాస్పదమే!

Published on Sat, 08/01/2026 - 09:55

అ‍స్సాంను ఇటీవల ముంచెత్తిన వరదలు ఒకవైపు వేలాది కుటుంబాలను దారుణంగా దెబ్బతీస్తే మరోవైపు సైబర్ నేరగాళ్లకు, అక్రమార్కులకు కాసులు కురిపించే అవకాశంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులను ఆదుకోవాలనే పౌరుల ఉదారతను ఆసరాగా చేసుకుని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భారీ విరాళాల దందా సాగుతోంది. నిధులు సేకరిస్తున్న ఖాతాల్లో ప్రతి పదింటిలో తొమ్మిది (దాదాపు 90%) వ్యాపార ఖాతాలు సందేహాస్పద రీతిలో ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

తనిఖీల్లో వెల్లడైన అంశాలు

పరిశోధన బృందం విరాళాలు సేకరిస్తున్న 40 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను సమగ్రంగా పరిశీలించగా అందులో 35 ఖాతాలు ప్రధాన భద్రతా ప్రమాణాల్లో విఫలమయ్యాయి. విరాళాలు కోరుతున్న 40 ఖాతాల్లో 38 ఖాతాలు కేవలం జులైలోనే కొత్తగా ప్రారంభించినవి. వీటి వెనుక ఎలాంటి గుర్తింపు లేదా పూర్వాపరాల రికార్డులు లేవు. 39 ఖాతాలు నమోదు చేసుకున్న స్వచ్ఛంద సంస్థలు లేదా ట్రస్టుల ఖాతాలకు కాకుండా వ్యక్తిగత యూపీఐ ఐడీలకు నిధులు మళ్లించేలా డిజైన్ చేశారు. 36 ఖాతాల్లో అందించిన ఫోన్ నంబర్లు అసలు పనిచేయడం లేదు లేదా సంప్రదించడానికి వీలు లేకుండా ఉన్నాయి.

పాత వీడియోలు.. తప్పుడు ప్రచారాలు

ప్రజల సానుభూతిని సొమ్ము చేసుకునేందుకు ఈ ఖాతాదారులు తీవ్ర మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళన సమయంలో ఉచిత ఆహార పంపిణీకి సంబంధించిన వీడియోలను రీ-ఎడిట్ చేసి అస్సాం వరద బాధితులకు సాయం చేస్తున్నట్లుగా ప్రచారం చేయడం గమనార్హం. మరికొందరు స్థానిక యంత్రాంగం ఉచితంగా పంపిణీ చేస్తున్న సహాయక సామగ్రినే తాము ప్రజల విరాళాలతో కొనుగోలు చేసి ఇస్తున్నట్లు క్లైమ్ చేస్తున్నారని స్థానిక ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆరోపిస్తున్నారు.

ఇలాంటి ప్రకృతి విపత్తుల వేళ దాతలు సోషల్ మీడియాలోని ప్రైవేట్ ఖాతాలకు నేరుగా డబ్బులు పంపకూడదు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ముఖ్యమంత్రి సహాయ నిధి లేదా విదేశీ నిధుల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద నమోదైన ప్రామాణిక స్వచ్ఛంద సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలను సరిచూసుకున్న తర్వాతే విరాళాలు అందించడం శ్రేయస్కరం.

ఇదీ చదవండి: బ్యాంక్‌ శాఖల్లో ప్రత్యేక యంత్రాల ఏర్పాటు

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)