Breaking News

వెండింగ్‌ మెషిన్ల ద్వారా బంగారం కొనుగోలు

Published on Thu, 05/01/2025 - 08:45

దేశవ్యాప్తంగా వచ్చే 12–18 నెలల్లో 50 వరకు బంగారం, వెండి వెండింగ్‌ మెషిన్లను ఏర్పాటు చేయనున్నట్టు యాస్పెక్ట్‌ బులియన్‌ అండ్‌ రిఫైనరీ ప్రకటించింది. ఈ వెండింగ్‌ మెషిన్ల ద్వారా బంగారం, వెండి కాయిన్లను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. వెండింగ్‌ మెషిన్‌ వద్దే అప్పటికప్పుడు ధరలను కస్టమర్లు చూసుకోవచ్చని.. రియల్‌టైమ్‌ మార్కెట్‌ ధరలు అక్కడ కనిపిస్తాయని పేర్కొంది. వేగంగా, భద్రంగా కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఈ వెండింగ్‌ మెషిన్లు ఉంటాయని.. మూడు నిమిషాల్లోనే కొనుగోలును పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్‌ కార్డు సహా పలు రకాల పేమెంట్‌ ఆప్షన్లను వినియోగించుకోవచ్చని తెలిపింది.

వెండింగ్‌ మెషిన్‌ ఎలా పని చేస్తుందంటే..

  • గోల్డ్ కాయిన్ వెండింగ్ మెషిన్లు సాధారణ వెండింగ్ మెషీన్ల మాదిరిగానే పనిచేస్తాయి. కానీ బంగారం విలువ కారణంగా అదనపు భద్రతను కల్పిస్తారు. అందులో భాగంగా వినియోగదారుల వెరిఫికేషన్‌ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

  • మెషిన్‌లో ముందుగా వినియోగదారులు తమకు కావాల్సిన బంగారు నాణెం బరువు, రకాన్ని ఎంచుకుంటారు.

  • నగదు, క్రెడిట్/డెబిట్ కార్డు లేదా మొబైల్ బ్యాంకింగ్ (యూపీఐ, క్యూఆర్ కోడ్లు మొదలైనవి) ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

  • కొన్ని యంత్రాలకు గుర్తింపు ధ్రువీకరణ అవసరం అవుతుంది. ముఖ్యంగా అధిక మొత్తంలో చేసే లావాదేవీల కోసం ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వంటి కేవైసీ (నో యువర్ కస్టమర్) పద్ధతులను ఉపయోగిస్తారు.

  • చెల్లింపు అయినట్లు ధ్రువీకరించిన తరువాత మెషిన్‌లోని స్టోరేజ్‌ కంపార్ట్‌మెంట్‌ నుంచి బంగారు నాణేన్ని రిలీజ్‌ చేస్తుంది.

ఇదీ చదవండి: ఐటీఆర్‌ ఫారంలను నోటిఫై చేసిన కేంద్రం

  • కొన్ని యంత్రాల ద్వారా బంగారు కడ్డీలు కూడా పొందే వీలుంటుంది. దానికి సంబంధించిన వివరాలను ముందుగానే వినియోగదారులకు తెలియజేస్తుంది.

  • పంపిణీ సమయంలో భద్రతకోసం సీసీటీవీ మానిటరింగ్, ట్యాంపరింగ్ ప్రూఫ్ మెకానిజమ్స్, వెయిట్ సెన్సర్లను అమరుస్తారు.

  • యంత్రాల్లో యాంటీ-థెఫ్ట్ అలారంలు, రియల్-టైమ్ ఇన్వెంటరీ ట్రాకింగ్ విధానం కూడా ఉంటుంది.

  • బంగారం కొనుగోలు రుజువు కోసం ఈ-రశీదులు కూడా పొందవచ్చు.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)