Breaking News

ఆర్థిక సమానత్వానికి సాధనంగా ఏఐ 

Published on Thu, 10/29/2026 - 04:53

ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) గురించి వివిధ వర్గాల్లో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ, ‘ఆర్థిక సమానత్వం’ సాధించేందుకు ఉపయోగపడే శక్తివంతమైన టెక్నాలజీగా దీన్ని తాము భావిస్తున్నామని టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఇండియా వీపీ ప్రీతి లొబానా తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటూ, అత్యంత చిన్న సంస్థలకు కూడా గ్లోబల్‌ కంపెనీల స్థాయి ఇంటెలిజెన్స్, వేగం, సామర్థ్యాలు, భద్రత కల్పించేదే అత్యుత్తమ సాంకేతికత అవుతుందని ఆమె చెప్పారు. భారతదేశవ్యాప్తంగా వినియోగదారుల అలవాట్లలో ఏఐ పలు మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. 

గూగుల్‌ క్లౌడ్‌ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. 600 మంది పైగా వ్యాపార దిగ్గజాలు, ఎండీలు, టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌లు దీనికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా వ్యాపార దిగ్గజాలతో తాను మాట్లాడినప్పుడు ఏఐ సామర్థ్యాల గురించి కొంత ఉత్సాహంతో పాటు రాబోయే రోజుల్లో తలెత్తే సంక్లిష్టతల గురించి కొంత ఆందోళన కనిపిస్తోందని ప్రీతి చెప్పారు. ఏఐ కోసం పెద్ద యెత్తున ఐటీ సిబ్బంది, భారీగా నిధులు అవసరమవుతాయని చాలా మటుకు సంస్థల్లో ఆందోళన నెలకొందని వివరించారు. కానీ గూగుల్‌ మాత్రం దీన్ని ఆర్థిక సమానత్వాన్ని సాధించేందుకు తోడ్పడే సాధనంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు.  

చిన్న సంస్థలకు ప్రయోజనం.. 
భారతదేశవ్యాప్తంగా వినియోగదారుల అలవాట్లలో ఏఐ పలు మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. చిన్న, మధ్యతరహా సంస్థల వాటా భారతదేశ జీడీపీలో దాదాపు మూడో వంతు, తయారీలో 35 శాతం పైగా ఉంటుందని, వికసిత భారత్‌ 2047 లక్ష్య సాధనకు ఇవి వృద్ధి చోదకంగా నిలుస్తున్నాయని ప్రీతి తెలిపారు. ఈ సంస్థలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకుంటే సరఫరా వ్యవస్థలు, ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో సానుకూల ప్రభావాలు కనిపిస్తాయని ఆమె వివరించారు. అభివృద్ధి, ఆకాంక్షలను సాధించుకోవడంలో దేశానికి సాధికారత కల్పించే సాంకేతికతను అందించాలనే నిబద్ధతతో భారత్‌లో రెండు దశాబ్దాలుగా తమ ప్రస్థానం సాగుతోందని ప్రీతి చెప్పారు. విశాఖలో ఏఐ హబ్‌ ఏర్పాటనేది ఇండియాఏఐ మిషన్‌కి దన్నుగా, దేశ డిజిటల్‌ వ్యవస్థకు వెన్నెముకగా ఉంటుందని ప్రీతి చెప్పారు. ఒకే ఒక్కరు నడిపే సంస్థ నుంచి 2 లక్షల మంది పైగా పని చేసే బడా సంస్థల వరకు అందరికీ ప్రపంచ స్థాయి కంప్యూట్‌ సామర్థ్యాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.  

 

Videos

భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!

హీరోగా వంగా ఇక స్క్రీన్ పై అరాచకమే

పబ్లిసిటీ ఆపి.. రైతులను ఆదుకో చంద్రబాబుకు కన్నబాబు డిమాండ్స్

దొంగ సంతకాలతో విత్ డ్రా చేశారు... మంత్రి ఆనంపై సంచలన వ్యాఖ్యలు

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

మంత్రి ఇలాకాలో టీడీపీ దౌర్జన్యం.. ఏడాదైనా మహిళకు దక్కని న్యాయం

అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ సెటైర్... సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)