Breaking News

కూతురు ఇచ్చిన గిఫ్ట్.. ప్రాణం కాపాడిన వాచ్!

Published on Thu, 07/30/2026 - 18:51

టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న కొద్దీ చాలా పనులు సులభంగా జరిగిపోతున్నాయి. దీంతో జీవితాలు కూడా సాఫీగా ముందుకు సాగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా సాంకేతికత ప్రాణాలను కాపాడుతోంది. దీనికి అమెరికాలో జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా నిలిచింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అమెరికాలోని ఒహాయో రాష్ట్రం, సిన్సినాటి నగరానికి చెందిన మహ్మద్ ఇస్లాం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అనుకోని ఒక సంఘటన జరిగింది. ఇంటి బయట చెత్త వేయడానికి వెళ్లిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలి స్పృహ కోల్పోయారు. కొంతసేపటి తర్వాత స్పృహ వచ్చినా.. లేచి నిలబడే పరిస్థితిలో లేకపోయారు. శరీరాన్ని కదిలించలేక నేలపైనే ఉండిపోయారు. ఆ సమయంలో ఆయన కట్టుకున్న యాపిల్ వాచ్  ప్రమాదాన్ని వెంటనే గుర్తించింది.

వాచ్‌లో ఉన్న ఫాల్ డిటెక్షన్ ఫీచర్ ఆయన పడిపోయిన విషయాన్ని గుర్తించి, ఎలాంటి స్పందన లేకపోవడంతో స్వయంచాలకంగా అత్యవసర సేవలకు కాల్ చేసింది. అంతేకాకుండా.. ముందుగా నమోదు చేసిన అత్యవసర కాంటాక్ట్‌లకు కూడా సమాచారం పంపింది. కొద్దిసేపటికే అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని మహ్మద్ ఇస్లాంను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆయన ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు.

సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడం వల్లే ఆయనకు వెంటనే చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం లభించిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు ముందు నుంచే.. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు సంబంధిత సమస్యలు, నడవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించినప్పటికీ అసలు కారణం ఏమిటో తెలియలేదని చెప్పారు. కుప్పకూలిన తర్వాతే పరిస్థితి తీవ్రంగా ఉందని గుర్తించారు.

మహ్మద్ ఇస్లాంకు ఈ యాపిల్ వాచ్‌ను ఆయన కుమార్తె గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వాచ్ తమ తండ్రి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిందని తెలుసుకుని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత సాంకేతిక పరికరాలు కేవలం సౌకర్యాలకే పరిమితం కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణరక్షక సాధనాలుగా కూడా ఉపయోగపడతాయని మరోసారి స్పష్టమైంది.

ఇదీ చదవండి: రైలు ఏసీ కోచ్‌లో రెండు బెడ్‌షీట్లు ఎందుకు ఇస్తారో తెలుసా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)