యాపిల్‌ మూడో స్టోర్‌ బెంగళూరులో.. రెంట్‌ ఎంతో తెలుసా?

Published on Mon, 06/02/2025 - 08:09

స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం యాపిల్ భారత్‌లో తన రిటైల్ ఉనికిని విస్తరించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలోని ముంబై, ఢిల్లీలలో తమ రిటైల్‌ స్టోర్లను ప్రారంభించిన యాపిల్‌..  మూడో స్టోర్‌ను బెంగళూరులో తెరుస్తోంది. ఉత్తర బెంగళూరులోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో యాపిల్‌ కొత్త స్టోర్‌ను ఏర్పాటు చేస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఢిల్లీ స్టోర్‌తో ఉత్తర భారతదేశంలో.. ముంబై స్టోర్‌తో పశ్చిమ భారత్‌లో ఆదరణను పెంచుకున్న యాపిల్‌.. ఇప్పుడు బెంగళూరులో ఏర్పాటు చేస్తున్న స్టోర్‌తో దక్షిణ భారత్‌లోనూ తమ ఉనికి విస్తరిస్తుందని భావిస్తోంది. తమ తయారీ భాగస్వామి ఫాక్స్‌కాన్ కూడా ఇక్కడ కొత్త మాన్యుఫ్యాక్చరింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు.

బెంగళూరు స్టోర్ రెంట్‌ ఎంతంటే..
యాపిల్‌ బెంగళూరులో ఏర్పాటు చేస్తున్న స్టోర్‌కు నెలకు రూ.16 లక్షలకు పైగానే అద్దె చెల్లించనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ బెంగళూరులోని తన స్టోర్ కోసం రూ .2.09 కోట్ల వార్షిక అద్దెతో 7,997.8 చదరపు అడుగుల స్థలాన్ని 10 సంవత్సరాల లీజుకు తీసుకుందని రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫామ్‌  ద్వారా పొందిన లీజు ఒప్పందాన్ని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. 2024 నవంబర్ 8న లీజు అధికారికంగా ప్రారంభం కాగా, 2025 ఆగస్టు 8 నుంచి అద్దె చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాపర్టీ స్పార్కిల్ వన్ మాల్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందినది.

Videos

YSRCP కాదు.. పక్కా జనసేన.. వాడికి పవన్ అంటే పిచ్చి.. అజయ్ దేవ్ చెల్లి షాకింగ్ నిజాలు

ఎవరికీ భయపడను! శివాజీ మరో సంచలన వీడియో

హిప్పో జర తప్పుకో, ఈ సెక్యూరిటీ ధైర్యానికి సలాం!

ఆంధ్రా కిమ్ నారా లోకేష్

పవన్ పీకింది చాలు! డిప్యూటీ సీఎంవా.. ఆకు రౌడీవా!

మార్కెట్లోకి Ai వాషింగ్ మిషన్లు

ఆడవారి దుస్తులపై మాట్లాడే హక్కు శివాజీకి లేదు

పొట్టు పొట్టు కొట్టుకున్న ఇప్పటం జనసేన నేతలు

శభాష్ ఇస్రో.. YS జగన్ ప్రశంసలు

శ్రీలంకతో జరిగిన రెండో T-20లో భారత్ విజయం..

Photos

+5

వారణాసి ట్రిప్‌లో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ (ఫొటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో ఫుల్ గ్లామరస్‌గా అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)

+5

#INDvsSL : విశాఖలో విశ్వవిజేతల దండయాత్ర (ఫొటోలు)

+5

మహేష్‌ బాబు ఫ్యామిలీలో వేడుక.. ఫోటోలు వైరల్‌

+5

అదరగొట్టిన విల్లా మేరీ కాలేజ్ విద్యార్థినులు (ఫొటోలు)

+5

‘ఈషా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కోలీవుడ్ స్టార్‌ కమెడియన్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

వైఎస్ జగన్‌ ప్రజాదర్బార్‌: సమస్యలు వింటూ.. భరోసా కల్పిస్తూ.. (ఫొటోలు)

+5

నా సూపర్‌స్టార్‌: భార్యకు సంజూ శాంసన్‌ విషెస్‌ (ఫొటోలు)