Breaking News

ఐటీ కంపెనీలను వణికిస్తున్న ఆ ‘పేరు’ మాదే..

Published on Thu, 02/12/2026 - 12:50

అమెరికా ఆధారిత ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ భారత విస్తరణ ప్రణాళికలు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అదే పేరుతో పనిచేస్తున్న భారతీయ సంస్థ ‘ఆంథ్రోపిక్ సాఫ్ట్‌వేర్’.. తమ బ్రాండ్‌కు గందరగోళం కలుగుతోందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు భారత కోర్టులో పెండింగ్‌లో ఉండటం వల్ల, దేశంలో ఆంథ్రోపిక్ వ్యూహాత్మక ప్రణాళికలు క్లిష్టతరం అయ్యే అవకాశముంది.

అమెరికా ఆంథ్రోపిక్ Vs ఇండియా ఆంథ్రోపిక్
టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. ఆంథ్రోపిక్ సాఫ్ట్‌వేర్ గత నెలలో కర్ణాటక వాణిజ్య కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. 2017 నుంచే తమ సంస్థ "ఆంథ్రోపిక్" పేరును ఉపయోగిస్తోందని, అమెరికా సంస్థ భారత మార్కెట్లో ప్రవేశించడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోందని కంపెనీ పేర్కొంది.

స్థానిక సంస్థ తన ముందస్తు వినియోగాన్ని అధికారికంగా గుర్తించాలని, అలాగే మరింత గందరగోళం నివారించేందుకు తగిన ఉపశమనం ఇవ్వాలని కోరుతోంది. అదనంగా, రూ.1 కోటి నష్టపరిహారం కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం.

భారతీయ సంస్థ వాదన ఏమిటంటే..
ఆంథ్రోపిక్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ మొహమ్మద్ అయ్యాజ్ ముల్లా టెక్ క్రంచ్‌తో మాట్లాడుతూ, ఈ ఫిర్యాదు వెనుక ఉద్దేశం ఘర్షణ కాదని, తమ ముందస్తు వినియోగానికి అధికారిక గుర్తింపు పొందడమేనని తెలిపారు. గుర్తింపు లభించకపోతే, చట్టపరమైన పోరాటాన్ని కొనసాగించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

భారతీయ సంస్థ తమ వెబ్‌సైట్‌లో “ఆంథ్రోపిక్ సాఫ్ట్‌వేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అప్లికేషన్ పెండింగ్) ట్రేడ్‌మార్క్” అని పేర్కొంది. ట్రేడ్‌మార్క్ నమోదు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, ఇది నేరుగా ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసుగా పరిగణించబడకపోవచ్చు. అయితే కోర్టు భారతీయ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇస్తే, అమెరికా సంస్థ భారతదేశంలో తన పేరును మార్చాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది.

ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రముఖ ఐటీ కంపెనీ

కేసు ప్రస్తుత స్థితి
జనవరి 20న కోర్టు ఆంథ్రోపిక్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. అయితే ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. అంటే, సంస్థ తన కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాల్సిన అవసరం లేదు. తదుపరి విచారణ ఫిబ్రవరి 16న జరగనుంది.

ఇదిలా ఉండగా, ఆంథ్రోపిక్ ఏఐ భద్రతా విభాగాధిపతి మృణక్ శర్మ రాజీనామా చేశారు. ఇలీవల ‘ఎక్స్‌’ (ట్విట్టర్)లో తన రాజీనామాను ప్రకటించారు. తాను వెంటనే కొత్త వెంచర్ ప్రారంభించడం లేదని, తదుపరి నిర్ణయం తీసుకునే ముందు స్వల్ప విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)