Breaking News

మానవ నియంత్రణ తప్పుతున్న నమూనాలు

Published on Sat, 06/06/2026 - 14:18

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు మానవాళి మనుగడకే సవాలుగా మారనుందా అంటే.. తాజా సాంకేతిక అంశాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ప్రముఖ ఏఐ పరిశోధనా సంస్థ ‘ఆంత్రోపిక్’ విడుదల చేసిన నివేదిక ఇప్పుడు చర్చకు దారితీసింది. అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థల అభివృద్ధిపై అంతర్జాతీయంగా తక్షణమే తాత్కాలిక విరామం(గ్లోబల్‌ పాజ్‌) ప్రకటించాలని ఆంత్రోపిక్ తెలిపింది. తాము రూపొందిస్తున్న ఏఐ నమూనాలు మానవ నియంత్రణ పరిధుల నుంచి తప్పించుకునే సంకేతాలను ప్రదర్శిస్తున్నాయని సంస్థ బాహాటంగా అంగీకరించడం గమనార్హం.

స్వీయ నియంత్రణ సాధ్యమేనా?

ప్రసిద్ధ క్లాడ్ ఏఐ నమూనాల సృష్టికర్త అయిన ఆంత్రోపిక్ సంస్థ సాంకేతిక పరిజ్ఞాన ప్రగతితో పాటు సామాజిక నిర్మాణాలు, భద్రతా ప్రమాణాల సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ గ్లోబల్‌ పాజ్‌ అత్యవసరమని పేర్కొంది. ‘సాంకేతిక పరిజ్ఞాన పురోగతిని తట్టుకునేలా సామాజిక వ్యవస్థలను సిద్ధం చేయడానికి, సరిహద్దు ఏఐ (ఫ్రంటీర్‌ ఏఐ) అభివృద్ధిని నెమ్మదిగా లేదా తాత్కాలికంగా నిలిపివేసే హక్కు ప్రపంచానికి ఉండాలి’ అని ఆంత్రోపిక్ స్పష్టం చేసింది.

అయితే, ఒకే ఒక్క సంస్థ లేదా దేశం అభివృద్ధిని ఆపితే ప్రయోజనం లేదని, ప్రత్యర్థి శక్తులు మరింత వేగంగా దూసుకుపోయే ప్రమాదముందని హెచ్చరించింది. అమెరికా, చైనాల వంటి అగ్రదేశాల్లోని ప్రధాన ఏఐ సంస్థలన్నీ ఒకే వేదికపైకి వచ్చి పరస్పర నిబంధనలను ధ్రువీకరించుకుంటూ ఏకకాలంలో విరామం ప్రకటిస్తేనే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ సమన్వయ యంత్రాంగం లేకపోతే భౌగోళిక రాజకీయ, వ్యాపార ఒత్తిళ్ల కారణంగా భద్రతను పణంగా పెట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

వైట్‌హౌస్ అభ్యంతరాలు

ఆంత్రోపిక్ చేసిన ఈ ప్రతిపాదనపై సిలికాన్ వ్యాలీతో పాటు వాషింగ్టన్ రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రమాదాల తీవ్రతను ఆంత్రోపిక్ అతిగా ఊహిస్తోందని, భద్రతా ఆందోళనల ముసుగులో ప్రత్యర్థులను వెనక్కి నెట్టే వ్యూహాత్మక పన్నాగం ఇదంటూ వైట్‌హౌస్ అధికారులు, సహచర టెక్ కంపెనీల ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు. ఏఐ అభివృద్ధిని ఆపడం వల్ల చైనాకు వ్యూహాత్మకంగా పైచేయి లభిస్తుందని అమెరికా అధికారులు భయపడుతున్నారు.

అయినప్పటికీ, ఆంత్రోపిక్ సంస్థ అత్యంత రహస్యంగా ఉంచిన ‘మైథోస్’ మోడల్ శక్తిని వైట్‌హౌస్ సైతం గుర్తించింది. అసాధారణమైన సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలు ఉన్నందున ఈ మోడల్‌ను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచలేదు. కేవలం నిశితంగా పరిశీలించిన అతికొద్ది సంస్థలకు మాత్రమే ప్రస్తుతం దీనికి యాక్సెస్‌ కల్పించారు. యూరప్‌కు కూడా ఈ మైథోస్ మోడల్ యాక్సెస్‌ణు ఆంత్రోపిక్ అందిస్తుండటం విశేషం.

ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!

#

Tags : 1

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)