Breaking News

మహీంద్రాతో పాక్‌ ఆర్థిక మంత్రికి సంబంధమేంటి?

Published on Fri, 08/18/2023 - 20:23

ఆనంద్‌ మహీంద్రా! పరిచయం అక్కర్లేని పేరు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్రా..స్ఫూర్తిదాయక కథనాలతో పాటు సమకాలీన సంఘటనలపై నిత్యం స్పందిస్తుంటారు. యూజర్లు వేసే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిస్తూ అందర్నీ ఆకర్షిస్తుంటారు. ఈ క్రమంలో..ఆయన ఛైర్మన్‌గా ఉన్న మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ గురించి ఓ ఆసక్తిర విషయం వెలుగులోకి వచ్చింది. 
   
ఆగస్టు 15, 1947న బ్రిటిష్‌ పాలకుల్ని తరిమికొట్టి స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాం. అదే ఏడాది జూన్‌ 3న భారత్‌ - పాక్‌లు వేరయ్యాయి. దీంతో కలిసి ఉన్నప్పుడు స్థాపించిన అనేక సంస్థలు విడిపోయాయి. అలాంటి వాటిల్లో మహీంద్రా అండ్‌ మహమ్మద్ కంపెనీ ఒకటి. ఇప్పుడు ఆ సంస్థే మహీంద్రా అండ్‌ మహీంద్రాగా భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.  

మహీంద్రా అండ్‌ మహీంద్రా బ్రిటీష్ ఇండియాలో 1945లో పంజాబ్‌లోని లూథియానాలో మహీంద్రా - ముహమ్మద్‌ సంస్థగా ప్రారంభమైంది. ఆనంద్‌ మహీంద్రా తాతా కైలాష్ చంద్ర మహీంద్రా, అతని సోదరుడు జగదీష్ చంద్ర మహీంద్రా.. మాలిక్ గులాం ముహమ్మద్‌తో కలిసి స్టీల్ ట్రేడింగ్ కంపెనీని స్థాపించారు. కంపెనీ బొంబాయిలో విల్లీస్ జీపులను తయారు చేసేది. మాలిక్ గులాం మహమ్మద్ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను చూసుకునేవారు. రెండేళ్ల తర్వాత విభజన జరగడం, మహమ్మద్ ఎం అండ్‌ ఎంలో తన వాటాను తీసుకొని పాకిస్తాన్‌కు వలస వెళ్ళాడు.

రాజకీయ నాయకుడిగా 
పాక్‌ తొలి ఆర్థిక మంత్రిగా పనిచేయకముందు, మహీంద్రా అండ్‌ మహ్మద్‌ స్థాపించకముందే  మహ్మద్‌ మాలిక్‌ గులాం రాజకీయాల్లో కీలకంగా పనిచేశారు. భోపాల్ రాష్ట్ర నవాబ్ హమీదుల్లా ఖాన్ ఆధ్వర్యంలో, హైదరాబాద్ నిజాంకు సలహాదారుగా పనిచేశాడు. యుద్ధ సమయంలో అతని సేవలను బ్రిటీష్ ప్రభుత్వం గుర్తించింది. 

ఒక అకౌంటెంట్, బ్యూరోక్రాట్,  పారిశ్రామికవేత్తగా కంటే, ముహమ్మద్ తన రాజకీయ చాతుర్యానికి ప్రసిద్ధి చెందాడు. అతను రాజ్యాన్ని, దాని సంస్థలను నాశనం చేయడానికి, సైన్యాన్ని ప్రోత్సహించడానికి బాధ్యత వహించిన పాకిస్తాన్‌లోని ప్రారంభ నాయకులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అయినప్పటికీ అతను ప్రధాన మంత్రి లియాఖత్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిగా మొదటి పంచవర్ష ప్రణాళికతో ఘనత పొందాడు.

విభజనకు ముందు బ్రిటీష్ ఇండియాలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాలిక్ గులాం ముహమ్మద్ ఖాన్‌తో క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేశారు. అలా మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ పాక్‌ దేశానికి తొలి ఆర్ధిక మంత్రిని అందించడం విశేషం.

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)