Breaking News

ఆనంద్‌ మహీంద్రా ఫోన్‌లో కొత్త యాప్‌ డౌన్‌లోడ్‌

Published on Mon, 10/06/2025 - 15:01

వాట్సాప్‌ మాదిరి దేశీయ కంపెనీ జోహో తయారు చేసిన ఆన్‌లైన్‌ కమ్యునికేషన్‌ యాప్‌ ‘అరట్టై’(Arattai)ని గర్వంగా డౌన్‌లోడ్‌ చేసినట్లు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా తన ఎక్స్‌ ఖాతాలో తెలిపారు. ఈ యాప్‌ మొదటిసారిగా 2021లో యాప్ స్టోర్‌లోకి ప్రవేశించింది. అయితే భారత ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ మేడ్ ఇన్ ఇండియా యాప్‌ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దేశీయ టెక్నాలజీ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడంలో తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. జోహో సంస్థ కొత్తగా రూపొందించిన చాట్, కాలింగ్ యాప్ అరట్టైకి ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా మద్దతు ప్రకటించారు. ‘గర్వంగా అరట్టైను డౌన్‌లోడ్ చేశా’ అని ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. దీనికి యాప్ అధికారిక హ్యాండిల్ తక్షణమే స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ అరట్టై ప్లాట​్‌ఫామ్‌లోకి ఆయనను ఆహ్వానించింది.

Anand Mahindra downloads Zoho's Arattai app, CEO Sridhar Vembu thanks him for support

దీనిపై కంపెనీ చీఫ్‌ శ్రీధర్ వెంబు స్పందిస్తూ.. ‘నేను మా తెన్కాసి కార్యాలయంలో అరట్టై ఇంజినీర్లతో సమావేశంలో ఉన్నాను. యాప్‌కు మెరుగుదలలు చేస్తున్నాం. మా టీమ్‌లో ఒక సభ్యుడు ఈ ట్వీట్‌ను చూపించాడు. ధన్యవాదాలు @anandmahindra. మీ మద్దతు మాకు మరింత స్ఫూర్తినిచ్చింది’ అని ఎ‍క్స్‌లో పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఆనంద్‌ మహీంద్రా ‘మీ జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ప్రోత్సహించారు.

Anand Mahindra downloads Zoho's Arattai app, CEO Sridhar Vembu thanks him for support

ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు..

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)