Breaking News

అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లకు భారీ షాక్‌!

Published on Wed, 12/27/2023 - 11:10

(2022 నాటికి) ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల్లో అమెజాన్‌ ప్రైమ్‌ సేవలు. 

200 మిలియన్ల మంది అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లు.

కేవలం నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే అమెజాన్‌కు వచ్చే ఆదాయం 35.22 బిలియన్‌ డాలర్లు  
 
ప్రత్యేకంగా నిర్వహించే అమ్మకాల్లో అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్ల నుంచి జరిగే వ్యాపారం విలువ12.9 బిలియన్‌ డాలర్లు. 


ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌కు ఇవేం సరిపోలేదట్లుంది. ఓటీటీ విభాగంలో అమెజాన్‌ ప్రైమ్‌కు ఉన్న డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. కొత్త ఏడాది నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో వీడియోలు చూసే సమయంలో యాడ్స్‌ను ప్రసారం చేయనున్నారు. తద్వారా మరింత ఆదాయాన్ని గడించనున్నారు. 

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం అమెజాన్‌ యూజర్లకు షాకిచ్చింది. ఇతర ఓటీటీ ప్లాట్‌పామ్‌ నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ ప్లస్‌ బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఏడాది జనవరి 29 నుంచి అమెజాన్‌ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఇకపై యాడ్స్‌ దర్శనమివ్వనున్నాయి. ఇప్పటికే ప్రకటనలపై అమెజాన్‌ యూజర్లకు మెయిల్‌కు సమాచారం అందించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

త్వరలో ప్రవేశపెట్టనున్న యాడ్స్‌ ఆప్షన్‌ వద్దనుకునే యూజర్లు నెలకు 3 డాలర్లు అంటే నెలకు రూ.249 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్‌ నెల నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్ల ఏడాదికి రూ.11,575 వసూలు చేస్తుంది. తాజాగా యాడ్స్‌ వద్దనుకునే యూజర్ల నుంచి అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది. 



ఓటీటీల్లో సరికొత్త సాంప్రదాయం
అమెరికాలో అమెజాన్‌ ప్రైమ్‌, మ్యాక్స్‌, పారామౌంట్‌ ప్లస్‌, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీప్లస్‌ ఇలా ఐదు ఓటీటీ దిగ్గజ సంస‍్థలున్నాయి. వాటిల్లో మ్యాక్స్‌, పారామౌంట్‌ ప్లస్‌లు 2021లోనే వీడియోల్ని వీక్షించే సమయంలో యాడ్స్‌ను ప్రసారం చేసేలా కొత్త సాంప్రదాయానికి తెరతీశాయి. ఆ తర్వాత 2022లో నెట్‌ఫ్లిక్స్‌ సైతం యాడ్స్‌ను డిస్‌ప్లే చేసింది. ఇప్పుడు అమెజాన్‌ సైతం వీడియోలపై ఆయా కంపెనీల ప్రకటనలు ప్రసారం చేసేందుకు సిద్ధమైంది. 2024 జనవరి 29 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోల్లో యాడ్స్‌ ప్రసారం చేస్తున్నామని, అమెరికా, యూకే, జర్మనీ, కెనడాతో పాటు ఇతర ప్రపంచ దేశాలకు చెందిన యూజర్లకు మెయిల్‌ చేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)